Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేంద్ర బడ్జెట్‌పై ఐటీ పరిశ్రమ స్పందన

కేంద్ర బడ్జెట్‌పై ఐటీ పరిశ్రమ స్పందన
, శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 (18:23 IST)
"లక్ష పైచిలుకు ఇంటర్నెట్ సౌలభ్యం కలిగిన సాధారణ సేవా కేంద్రాలు (సీఎస్‌సీఎస్) మరియు స్టేట్ వైడ్ ఏరియా నెట్‌వర్క్స్ (ఎస్‌డబ్ల్యూఏఎన్) ఐటీ ఫలాలను ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే టెక్నాలజీ కోసం ఎదురుచూస్తున్న ఒక బిలియన్ భారతీయులకు ఈ గణాంకాలు సంతృప్తిని కలిగించే అవకాశం లేదు. భారతీయులకు పూర్తి స్థాయిలో ఐటీ ఫలాలను అందించేందుకు ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలను ఐదింతలు పెంచాలి."
--- పంకజ్ జైన్, ప్రెసిడెంట్ మరియు సీఓఓ వెబ్‌దునియా.కామ్, భారతదేశపు అతిపెద్ద బహుభాషా పోర్టల్ మరియు 11 భారతీయ భాషల్లో ఇమెయిల్ సేవలను అందిస్తున్న కంపెనీ

" కొత్తగా మూడు ఐఐటీల ఏర్పాటు, నవీకరణ, పరిశోధన మరియు అభివృద్ధికి ఉపకార వేతనాలు, విశ్వవిద్యాలయాలను అనుసంధానించేందుకు జాతీయ విజ్ఞాన నెట్‌వర్క్ తదితర ప్రతిపాదనలతో భారతదేశాన్ని విజ్ఞానవంతమైన సమాజంగా భారతదేశాన్ని నిర్మించే ప్రక్రియను స్వాగతిస్తున్నాం."
--- ప్రదీప్ గుప్తా, ఛైర్మన్, సైబర్ మీడియా

"విద్యా వైద్య రంగాలకు గణనీయమైన కేటాయింపులు కొత్తగా జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమ అంకురార్పణతో భారతీయ ఆర్థికాభివృద్ధిలో విజ్ఞాన ఆధారిత పరిశ్రమలు పాలుపంచుకునేందుకు ఆశాజనకమైన సంకేతాన్ని అందిస్తున్నాయి. "
--- కపిల్ దేవ్ సింగ్, కంట్రీ మేనేజర్, ఐటి ఇంటలిజెన్స్ అండ్ అడ్వైజరీ ఫర్మ్, ఐడీసీ ఇండియా.

"జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమ అంకురార్పణతో కేంద్ర ఆర్థిక మంత్రి నైపుణ్యాభివృద్ధి భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని జాతికి సరికొత్త మార్గాన్ని చూపుతున్నారు. మంత్రి చేపట్టిన ఈ మానవీయ బృహత్తర కార్యక్రమంలో కీలక పాత్ర పోషించేందుకు విజ్ఞానాధారిత పరిశ్రమ సంతోషంగా ముందుకు వస్తుంది."
-- అశోక్ కె.లహా. మేనేజింగ్ డైరక్టర్ చీఫ్ టాలెంట్ ఆఫీసర్, ఇంటెర్రా ఐటీ, నోయిడా స్పెషల్ ఎకనమిక్ జోన్.

Share this Story:

Follow Webdunia telugu