Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"బొమ్మాళీ" అనుష్క పర్సనల్ టచ్

"ఈనాడు" హీరో కమల్ హాసన్ పుట్టిన రోజునే "అరుంధతి" పుట్టింది. సినీరంగంలో 50 సంవత్సరాలపాటు తన హవాను కొనసాగిస్తున్న లెజండ్ స్టార్ కమల్ హాసన్‌కు ఈ నెల ఏడోతేదీన పుట్టినరోజు. అదే రోజున బిల్లా సుందరి, అరుంధతి తార బొమ్మాళీకి కూడా పుట్టినరోజు. 

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ రంగాలతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల్లో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతోన్న అనుష్క వేట్టైక్కారన్ (తమిళం), వేదం (తెలుగు) చిత్రాల్లో నటిస్తోంది.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన "సూపర్" చిత్రం ద్వారా సినీరంగంలో అడుగుపెట్టిన అనుష్క.. తర్వాత విక్రమార్కుడు, లక్ష్యం, ఒక్కమగాడు, డాన్, చింతకాయల రవి వంటి పలు హిట్ చిత్రాల్లో నటించింది. బెంగళూరు నగరానికి చెందిన యోగా టీచర్ అయిన అనుష్కకు గ్లామర్ పంటతో హీరోయిన్ రోల్స్ ఒకవైపు మంచి పేరు సంపాదించిపెట్టగా, మరోవైపు "అరుంధతి" సినిమా ఆమె కెరీర్‌కు గుర్తింపు తెచ్చిపెట్టింది.

మంగుళూరులో పుట్టిన అనుష్క బెంగళూరులో పాఠశాల, ఉన్నత విద్యను పూర్తి చేసింది. బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాలనుండి బి.సి.ఏ పట్టా పొందిన అనుష్కకు ఫిట్‌నెస్ రంగంలో పనిచేయాలని అభిలాష. యోగా శిక్షణ ఇస్తున్న బొమ్మాళీకి.. కథానాయిక భూమికా చావ్లా భర్త భరత్ ఠాకూర్ గురువు.

ప్రస్తుతం దక్షిణాది రంగాన్ని తన గ్లామర్‌తో ఓ ఊపు ఊపుతోన్న అనుష్క.. వచ్చే పుట్టినరోజు లోపు ఉత్తరాది సినీరంగ ప్రవేశం చేసే అవకాశం ఉందని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. అంతేకాదు.. బాలీవుడ్ కండల వీరుడు షారూఖ్ ఖాన్.. బొమ్మాళీని తన తదుపరి చిత్రంలో నటించే ఛాన్స్ ఇవ్వనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అలాగే "అరుంధతి" హిందీ వర్షన్‌లోనూ ఈ యోగాటీచర్ బొమ్మాళీగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

ఇకపోతే.. అనుష్క పుట్టిన స్థలం: మంగళూరు (కర్ణాటక)
పుట్టిన తేదీ: నవంబర్ 7, 1981 (1981-11-07)
మాతృభాష: తులు.
అసలు పేరు: స్వీటి శెట్టి
ఇతర పేర్లు: స్వీటీ, టొమ్ములు,
ఎత్తు: 5 అడుగుల 7.5 అంగులాలు,
తల్లిదండ్రుల పేర్లు: విట్టల్ శెట్టి, ప్రపుల్లా వి. శెట్టి.

Share this Story:

Follow Webdunia telugu