Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఖడ్గం" బ్యూటీ సంగీత పర్సనల్ టచ్

WD
"ఖడ్గం" చిత్రం ద్వారా అద్భుతమైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ క్వీన్ సంగీత. 'ఈ అబ్బాయి చాలా మంచోడు', 'పెళ్లాం ఊరెళితే', 'శివపుత్రుడు' వంటి సినిమాల్లో నటించిన సంగీత.. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన నేపథ్య గాయకుడు క్రిష్‌ను వివాహమాడింది.

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సుమారు 20 చిత్రాలకు పైగా నటించిన సంగీత.. గాయనిగా, రసికగా అందరికి తెలిసే ఉంటుంది. తమిళనాడులోని చెన్నైలో అరవింద్, భానుమతి దంపతులకు సంగీత జన్మించింది.

భరతనాట్యంలో ఆరితేరిన సంగీత... ప్రముఖ కోలీవుడ్ నిర్మాత కె.ఆర్.బాలన్ మనుమరాలు. టాలీవుడ్‌లో మిని బడ్జెట్ చిత్రాల్లో నటించిన సంగీతకు జాతీయ అవార్డు పొందిన "శివపుత్రుడు" చిత్రం మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది.

నేపాలి, ధనం తదితర తెలుగు చిత్రాల్లో నటించిన సంగీత తాజాగా "శ్రీమతి కళ్యాణం" అనే సినిమాలో నటిస్తోంది. ఇంకా కోలీవుడ్ బుల్లితెరపై పలు హిట్ టీవీ షోల్లో సంగీత ప్రేక్షకులకు దర్శనమిస్తోంది.

ఇకపోతే ఈమె అసలు పేరు: సంగీత
జన్మస్థలం: తమిళనాడు
ఇతర పేర్లు: రసిక, సంగీత క్రిష్,
తొలి తెలుగు చిత్రం: ఖడ్గం
ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న చిత్రాలు: శ్రీమతి కళ్యాణం, దుర్గ.

Share this Story:

Follow Webdunia telugu