Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

డీవీ
గురువారం, 16 మే 2024 (15:58 IST)
Naveen Chandra, Varun Sandesh
కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ అనే చిత్రం రాబోతోంది. వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసాయి. 
 
తాజాగా ఈ మూవీ టీజర్‌ను విలక్షణ నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. టీజర్ విడుదల చేసిన అనంతరం చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. టీజర్ బాగుందని టీంను మెచ్చుకున్నారు. ‘జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’.. అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్‌లో ఎన్నో కోణాలున్నాయి. అందమైన ప్రేమ కథ కనిపిస్తోంది. దాంతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ టీజర్‌లోని విజువల్స్ ఎంతో న్యాచురల్‌గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ అయితే మూడ్‌కు తగ్గట్టుగా సాగింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను ఫీల్ అయ్యేలా నేపథ్య సంగీతం సాగింది.
 
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతూన్నారు.
 
నటీనటులు : వరుణ్ సందేశ్, ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్దార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ్ కృష్ణ, రాజ్ కుమార్ కుర్రా, దుర్గా అభిషేక్ తదితరలు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హత్రాస్‌ జిల్లాలో తొక్కిసలాట- 80కి చేరిన మృతుల సంఖ్య

రైతు ఆత్మహత్య.. సీరియస్‌గా తీసుకున్న సీఎం.. రూ.25లక్షలు డిమాండ్

కుమార్తెను గర్భవతిని చేసిన కిరాతక తండ్రికి 101 యేళ్ళ జైలు!

ఉత్తరప్రదేశ్‌‌, హత్రాస్‌లో తొక్కిసలాట.. 27మంది మృతి.. మహిళలే ఎక్కువ

ప్యారిస్‌లో అరకు కాఫీ.. చంద్రబాబు నాయుడు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments