Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింధూర గద్దె తొలి తెలుగు చిత్రం "సంగమం" ట్రైయిలర్

సింధూర గద్దె తొలి తెలుగు చిత్రం
, బుధవారం, 9 జులై 2008 (18:53 IST)
WD
మిస్ ఇండియా (2005) సింధూర గద్దె తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం "సంగమం". "ఒకరికి ఒకరు" ఫేం రసూల్ దర్శకత్వంలో ప్రవాసాంధ్రుడు రమణ పెమ్మరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహిత్ ఖురానా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల ద్వితీయార్థంలో విడుదల చేయనున్నట్లు సినీ యూనిట్ వర్గాలు తెలిపాయి

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ప్రతి సన్నివేశాన్ని విమర్శనాత్మకంగా ఆలోచించి చిత్రీకరించామని, సినిమా బాగా వచ్చిందని అన్నారు. ఓ మంచి ప్రేమ కథా చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో అన్నిరసాల సమ్మేళంగా రూపొందించామని, క్వాలిటీలో ఎక్కడా రాజీ పడలేదని వెల్లడించారు.

ఈ చిత్రంలో ప్రేమ సజీవమైందని, రెండు మనసుల సంగమమే ఈ చిత్రమని కీరవాణి వెల్లడించారు. మురళీ మోహన్, రాఘవ, సుబ్బరాజు, రఘునాథ్ రెడ్డి, విజశ్రీ, అనిల్స, ఆనంద్ వర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైయిలర్ రూపంలో మీకోసం..

Share this Story:

Follow Webdunia telugu