Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'అల్లుడు శీను'కు అంత అవసరం ఉందా... సినిమా ఫస్ట్ పాయింట్...

'అల్లుడు శీను'కు అంత అవసరం ఉందా... సినిమా ఫస్ట్ పాయింట్...
, శుక్రవారం, 25 జులై 2014 (13:03 IST)
బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శుక్రవారం విడుదలయిన చిత్రం అల్లుడు శీను. ఈ చిత్రం కొత్త సీసాలో పాత సారా... అన్నట్లుగా ఉందనే కామెంట్లు వస్తున్నాయి. వినాయక్ గత సినిమాలలోని పాయింట్లన్నిటినీ కలగూరగంపలా మార్చేసి అల్లుడు శీనును చుట్టేశారనే విమర్శలు కూడా వచ్చేస్తున్నాయి. 
 
కథలోకి వెళితే... ప్రకాష్ రాజ్ అన్నతమ్ముడుగా రెండు పాత్రలు పోషించారు. అన్న ఎమ్మెల్యేగా ఆ ఊరిని ఉద్దరించేందుకు విరాళాలు పోగేస్తే... తమ్ముడు వాటిని కాజేసేందుకు అన్ననే లేపేస్తాడు. అన్నను హత్య చేసి తన సోదరుడు జనం సొమ్మును తీసుకుని పారిపోయాడంటూ ప్రజలను నమ్మించి ఆ డబ్బుతో అక్రమ వ్యాపారానికి తెరతీస్తాడు. ఐతే తన అన్నకు స్వయానా మేనల్లుడైన అల్లుడు శీను ఇతడి ఆటను ఎలా కట్టించాడన్నదే సినిమా.
 
ఇకపోతే బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శీను యాక్షన్, ఫైట్స్, హైట్ అంతా ఓకే. కానీ ఎక్కడా కొట్టిందన్నా అన్నట్లు అతడిలో ఆకర్షణశక్తి అంతగా కనబడుతున్నట్లు అనిపించలేదనే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఐతే గతంలో చాలామంది హీరోల ముఖాన్ని తొలిరోజుల్లో చూడలేనట్లుగా ఉన్నప్పటికీ వారంతా ఇప్పుడు టాప్ హీరోల్లా వెలిగిపోతున్నారు కనుక దీన్ని ఆట్టే పట్టించుకోనవసరంలేదు. 
 
కాబట్టి అల్లుడు శీను హీరో తనదైన శైలిని కనబరుస్తాడని అనుకోవచ్చు. సమంత సీనియర్ హీరోయిన్ కనుక హీరో శ్రీనివాస్ పక్కన ముదురుభామలా అనిపించింది. బహుశా... ఆమె సీనియర్ హీరోయిన్ ముద్ర ఉంది కనుక అలా అనిపించి ఉండవచ్చు. ఇకపోతే ఈ చిత్రం కథను చూస్తే అంతా ఇండియాలోనే చుట్టేయవచ్చు. కానీ స్విట్జర్లాండ్, షార్జా అంటూ చాలా దేశాలు తిప్పేశారు. అల్లుడు శీను కథ ప్రకారం చూస్తే అంత అవసరమా అనిపిస్తుంది. మొత్తమ్మీద అల్లుడు శీను ఫస్ట్ పాయింట్ ను బట్టి చూస్తే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu