Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీక్వెల్‌ దిశగా 'అడవి కాచిన వెన్నెల' రివ్యూ రిపోర్ట్‌

సీక్వెల్‌ దిశగా 'అడవి కాచిన వెన్నెల' రివ్యూ రిపోర్ట్‌
, గురువారం, 31 జులై 2014 (18:02 IST)
'ఋషి' ఫేం అరవింద్‌కృష్ణ, మీనాక్షి దీక్షిత్‌, పూజ రామచంద్రన్‌ నటీనటులుగా మూన్‌లైట్‌ డ్రీమ్స్‌ పతాకంపై అక్కి విశ్వనాధరెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'అడవి కాచిన వెన్నెల'. ఆగస్టు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని జూలై 31న హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ప్రదర్శించారు.
 
కథ : ఇది ఒక రకంగా సైన్స్‌ఫిక్షన్‌ను, హిస్టారికల్‌ ఈవెంట్‌ను కలిపి చేసిన ప్రయోగమే ఈ చిత్రం. షూటింగ్‌ కోసం రాయలసీమ గ్రామం సెట్‌ను కొంపల్లిలో వేశారు. ఇందులో మరో ప్రత్యేకత ఏమంటే 26 నిమిషాల సిజి వర్క్‌లో చోళపాండ్య రాజులు, గండికోట యుద్ధంనాటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఆఫ్రికాలో మైనింగ్‌ పెద్దగా వినోద్‌కుమార్‌, విలన్‌గా సీనియర్‌ సురేష్‌ నటించారు. ఈ బ్యాక్‌డ్రాప్‌ను సిజిలో క్రియేట్‌ చేసి అద్భుతంగా వచ్చేలా చేశారు.
 
అదేకాకుండా సిజి వర్క్‌లో భాగంగానే రోనాల్డ్‌ రీగన్‌ షిప్‌ను, స్విట్జర్లండ్‌లో ఓ ప్రదేశాన్ని చైనా వాటర్‌ఫాల్స్‌ను ఏర్పాటుచేసి చాలా తమాషాగా రూపొందించారు. ఇందులోని పాటలన్నింటినీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ఈ చిత్రాన్ని నైజాం, వైజాగ్‌లో దిల్‌ రాజు, మిగిలినచోట్ల ఇతర డిస్ట్రిబ్యూటర్లు విడుదల చేశారు.
 
వివరణ :
కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఇది నచ్చుతుంది. అయితే మహేష్‌ బాబు '1'చిత్రం తరహాలో సామాన్యుడికి అందని కాన్సెప్ట్‌ ఇది. అందరినీ అలరించడం చాలా కష్టమైన పనే. తెలుగులో కొత్త కథలకు ఇదొక సూచికగా చెప్పవచ్చు. ముగింపులో కొనూపిరిలో కూడా వున్న మనిషిని బతికించే ఔషధం కోసం హీరో వేట మొదలెడతాడు. అది అందినట్లే అంది చివరికి జారిపోతుంది. దాంతో పార్ట్‌-2 అని స్లైడ్‌ వేస్తాడు.. సో... మొదటి భాగాన్ని ఓపిగ్గా కూర్చుని చూసినవారికి 2వ భాగం చూడ్డానికి రెడీగా ఉండండి.

Share this Story:

Follow Webdunia telugu