Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమ కథా చిత్రాలకు భిన్నంగా 'లైలా మజ్ను'

ప్రేమ కథా చిత్రాలకు భిన్నంగా 'లైలా మజ్ను'
, శుక్రవారం, 8 జూన్ 2007 (10:23 IST)
తారాగణం : హరివరుణ్‌, జ్యోతికృష్ణ, నర్రా వెంకటేశ్వరరావు, చలపతిరావు, మురళీ మోహన్‌, బ్రహ్మాజీ, రఘు, సూర్య, చిన్న, బాబు మోహన్‌, ఎమ్మెస్.నారాయణ, చిత్రం శ్రీను, బబ్లూ, సన, తెలంగాణ శకుంతల తదితరులు.
సంగీతం : ఎమ్‌ ఎమ్‌ శ్రీలేఖ,
సమర్పణ : బేబి సాహితి
నిర్మాత : బొల్లినేని సురేష్‌ నాయుడు
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : 'అంజి' శ్రీను

గతంలో వచ్చిన చాలా ప్రేమ కథా సినిమాలు విషాదంతోనే ముగుస్తాయి. లైలామజ్ను అనగానే మనకు విషాద ప్రేమగాధే గుర్తుకు వస్తుంది. యువత ప్రేమలో పడడం సహజం. కొన్ని ప్రేమలు కేవలం ఆకర్షణకే పరిమితం కాగా కొన్ని నిజమైన ప్రేమకు మారుపేరుగా నిలుస్తాయి.

అబ్బాయి, అమ్మాయి మధ్య నిజమైన ప్రేమే ఉన్నా వారికి కులం, మతం, అస్తి, అంతస్తులు అడ్డంకిగా నిలుస్తాయి. కొంతమంది వీటన్నిటినీ ఎదుర్కొని ఎక్కడికో వెళ్లిపోయి పెళ్లిచేసుకుంటారు. ప్రేమికుల ధైర్యం, స్వభావాన్ని బట్టి వారి ప్రేమ తీరతెన్నులు ఆధారపడి ఉంటాయి. తాజాగా ఈ కాన్పెప్ట్‌తో వచ్చిన 'బొమ్మరిల్లు' సినిమా సూపర్‌హిట్‌ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు 'అంజి' శ్రీను కూడా అదే థీమ్‌తో సినిమాను రూపొందించినప్పటికీ కథ నడిచే తీరులో వైవిధ్యాన్ని కనపరిచాడు. ఇక్కడికి వచ్చిన తరువాత మహి (జ్యోతికృష్ణ) ప్రేమలో పడతాడు. సిద్ధు (హరివరుణ్‌) అమెరికాలో విద్యాభ్యాసం చేస్తూ సెలవుల్లో భారత్‌కు వస్తాడు. ధనికుడు, అమెరికాలో చదువుకుంటున్నప్పటికీ ఇక్కడి సంసృతీ సంప్రదాయాలు ఆయనకు బాగా నచ్చుతాయి.

అయితే సిద్ధు సోదరుడు విక్కీ (రఘు), మహి సోదరుడు నాయుడు (బ్రహ్మాజీ) బద్ధ విరోదులు. అవకాశం దొరికితే చాలు గొడవకు దిగుతారు. ఇవేమీ పట్టించుకోకుండా సిద్ధు తన ప్రేమను మహికి తెలియజేస్తాడు. తన అన్నకు తెలిస్తే సిద్ధుకు ప్రమాదమని మహి బయపడుతుంది కానీ ఆమెను ఒప్పిస్తాడు. హీరోహీరోయిన్లు ఒప్పందం ప్రకారం విడిపోతారు. సిద్ధు అమెరికాకు తిరిగి వెళతాడు. వెళుతూ వెళుతూ మహీ ఇచ్చిన రింగ్‌ను సెంటిమెంటల్‌గా తిరిగి ఇవ్వడానికి సిద్ధమవుతాడు.

ఈ నేపధ్యంలో విక్కీ, నాయుడులు వారివారి తల్లితండ్రులను పెళ్లికి ఎందుకు తిరస్కరించారని అడుగుతారు. దీనికి కారణం మీరేనని వారు చెప్పడంతో కంగుతిన్నవారు ప్రేమికులను కలపడానికి అత్మహత్యయత్నానికి పాల్పడతారు. ఇది తెలిసిన పెద్దలు పెళ్లికి ఒప్పుకోవడంతో సినిమా సుఖాంతమవుతుంది.

అన్ని పాత్రలకు దర్శకుడు సమన్యాయాన్ని ఇవ్వడం, పెద్ద పెద్ద విలన్‌లు లేకపోవడం, కుటుంబపెద్దలే విలన్‌లుగా మారడం సినిమాలో అసక్తి కలిగించే అంశాలు. సందర్భానుసారంగా కామెడీ ఈ సినిమాకు హైలెట్‌. ఎమ్‌ ఎస్‌ నారాయణ, చిత్రం శ్రీనులతో, తెలంగాణ శకుంతల, బాబుమోహన్‌, రఘు, బ్రహ్మాజిల కామెడీ ట్రాక్‌ బాగా రాణించింది. ఎమ్‌ ఎమ్‌ శ్రీలేఖ సంగీతం మెలోడియస్‌గా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu