Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డిసెంబర్‌ 15న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో

డిసెంబర్‌ 15న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో
, సోమవారం, 3 డిశెంబరు 2012 (16:32 IST)
WD
విక్టరీ వెంకటేష్‌, సూపర్‌స్టార్‌ మహేష్‌ కాంబినేషన్‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. దాదాపు 25 సంవత్సరాల తర్వాత తెలుగులో నిర్మాణమవుతున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ ఇది. ఈ చిత్రం రెండు పాటలు మినహా టోటల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. డిసెంబర్‌ 15న హైదరాబాద్‌లో ఈ చిత్రం ఆడియో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. జనవరి 11న సంక్రాంతి కానుకగా వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ - ''రెండు పాటలు మినహా షూటింగ్‌ పార్ట్‌ అంతా పూర్తయింది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన భద్రాచలం దేవాలయ ప్రాంగణం సెట్‌లో ప్రధాన తారాణం, వేలాది మంది జనం మధ్య క్లైమాక్స్‌ సన్నివేశాలు చాలా భారీ ఎత్తున చిత్రీకరిచడం జరిగింది. దీంతో రెండు పాటలు మినహా టోటల్‌ షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. డిసెంబర్‌ 15న హైదరాబాద్‌లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో ఫంక్షన్‌ చాలా గ్రాండ్‌గా జరుగుతుంది. జనవరి 11న సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు.

విక్టరీ వెంకటేష్‌, సూపర్‌స్టార్‌ మహేష్‌, సమంత, అంజలి, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, రోహిణి హట్టంగడి, అభినయ, కోట శ్రీనివాసరావు, వేణుమాధవ్‌, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, రావు రమేష్‌, ఆహుతి ప్రసాద్‌ రవిబాబు, రాజారవీందర్‌, సుమిత్‌ అరోరా, రమాప్రభ, రజిత, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాస్‌ శ్రీను, బ్రహ్మాజీ, మేలొక్కటె, ఆర్‌.జె. హేమంత్‌, ఢిల్లీ రాజేశ్వరి, మురళీమోహన్‌, దేవిశ్రీ, ఐడిపిఎల్‌ నిర్మల, కల్పలత, కల్పిక, భువన, తేజస్విని, రచన, నరేష్‌, ప్రవీణ్‌, గిరిధర్‌, కోలా శ్రీను, సత్యదేవ్‌, వెన్నెల రామారావు, హరీష్‌, హేమంత్‌, అనురాధ, సర్వమంగళ, ల్యాబ్‌ శరత్‌, హరిచరణ్‌, డా|| శైలజ, లలిత, అపర్ణ, శ్రావణి, అర్జున్‌, సంతోష్‌, అర్జున్‌ ఉదయ్‌కుమార్‌, సోహైల్‌, ఫణి, రాజబాబు, కోటేశ్వరరావు, కాటంరెడ్డి, గౌరేశ్వరరావు, బిహెచ్‌ఇఎల్‌ ప్రసాద్‌, సురేష్‌కుమార్‌, ఇందూఆనంద్‌, కిరణ్‌, డా|| అనిల్‌కుమార్‌, చందనచక్రవర్తి, రాఘవేంద్ర, ఆనంద్‌వర్మ ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: కె.వి.గుహన్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రవికుమార్‌ పిళ్ళ, ఫైట్స్‌: విజయ్‌, కో-డైరెక్టర్‌: రెడ్డి తరణీరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: జి.నాగేశ్వరరావు, కో-ప్రొడ్యూసర్స్‌: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌రాజు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

Share this Story:

Follow Webdunia telugu