Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబ్బ.. మన శంకరవర ప్రసాద్ ఫుల్ మీల్స్ వినోదం, ఆడియెన్స్ పల్స్ పట్టుకున్న రావిపూడి

Advertiesment
chiranjeevi

ఐవీఆర్

, సోమవారం, 12 జనవరి 2026 (14:23 IST)
ఇన్నాళ్లకు మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మన శంకర వరప్రసాద్ చిత్రం రూపంలో ఫుల్ మీల్స్ లాంటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సంక్రాంతి పండుగకు పిల్లాపాపలతో కలిసి చూడదగ్గ సినిమాగా విశ్లేషకులు చెబుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రాలన్నీ దాదాపుగా హిట్ కొడుతున్నాయి. అందుకే చిత్రం విడుదలకు ముందే మరో సబ్జెక్ట్ రెడీ చేసుకోమని చెప్పారు చిరంజీవి.
 
మన శంకర వరప్రసాద్ చిత్రం సూపర్ సక్సెస్ టాక్ రావడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నది. మెగాస్టార్ చిరంజీవితో పాటు అనిల్ రావిపూడి, నిర్మాతలు గారపాటి సాహు, సుస్మిత కొణిదెల కేక్ కట్ చేసి స్వీట్స్ తినిపించుకున్నారు.
 
మరోవైపు ఈ చిత్రం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కేవలం ప్రీమియర్స్ లోనే మిలియన్ డాలర్లు వసూలు చేసిన రెండో చిత్రంగా మన శంకర వరప్రసాద్ చరిత్ర సృష్టించింది. విశేషం ఏంటంటే... బుక్ మైషోలో కేవలం 24 గంటల్లో 2.86 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Karate Kalyani: హరికథా కళాకారులకు అండగా కరాటే కళ్యాణి