Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శభాష్ నాయుడు ఎఫెక్ట్ : శ్రుతిహాసన్ మల్టీట్యాలెంటెడ్ గర్ల్.. బ్రహ్మానందం కితాబు..!

సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తె.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రుతిహాసన్‌పై కామెడీ కింగ్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ప్రశంసల జల్లు కురిపించారు. కమల్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైన శ్రుతిహాసన్ తన నటనతో ప్రే

శభాష్ నాయుడు ఎఫెక్ట్ : శ్రుతిహాసన్ మల్టీట్యాలెంటెడ్ గర్ల్.. బ్రహ్మానందం కితాబు..!
, గురువారం, 23 జూన్ 2016 (11:34 IST)
సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తె.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రుతిహాసన్‌పై కామెడీ కింగ్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ప్రశంసల జల్లు కురిపించారు. కమల్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైన శ్రుతిహాసన్ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పాడు. బ్రహ్మీ ఆమెతో దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. విత్ ఏ మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ శ్రుతిహాసన్ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు.
 
ప్రస్తుతం కమల్ హాసన్, శ్రుతిహాసన్‌లతో కలిసి బ్రహ్మానందం ''శభాష్ నాయుడు" సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే బ్రహ్మీ శ్రుతిహాసన్‌పై ప్రశంసలు గుప్పించాడు. కాగా గబ్బర్ సింగ్, శ్రీమంతుడు వంటి భారీ హిట్ సినిమాలలో నటించిన శ్రుతిహాసన్ ప్రస్తుతం గబ్బర్ సింగ్ జోడి పవన్ తీయబోయే సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. 
 
అంతేకాకుండా ఇటీవలే విడుదలైన ''రాకీ హ్యాండ్ సమ్" సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే శ్రుతిహాసన్ నటించిన సింగం 3 సినిమా విడుదలకు రెడీ అవుతుండగా, ఆపై చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయని సన్నిహితుల సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంపూను బండబూతులు తిట్టిన ఆట ఆర్గనైజర్... అనసూయ మద్దతు