Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అఖిల్ సినిమా ఆడియో ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్.. నితిన్ కోసమేనా?

అఖిల్ సినిమా ఆడియో ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్.. నితిన్ కోసమేనా?
, సోమవారం, 31 ఆగస్టు 2015 (14:22 IST)
పవన్ కల్యాణ్ అఖిల్ సినిమా ఆడియో ఫంక్షన్‌కు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నితిన్ మూవీ మినహా టాలీవుడ్‌లో ఏ హీరో సినిమా ఆడియో ఫంక్షన్లతో పాటు మెగా హీరోల ఆడియో వేడుకలకు కూడా కాస్త దూరంగా ఉండిపోయే పవన్ కల్యాణ్.. అఖిల్ తొలి సినిమా ఆడియో ఫంక్షన్‌కు హాజరవుతాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
అఖిల్ అక్కినేని సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, నటుడు నితిన్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నాడు. నిర్మాత, నటుడు అయిన నితిన్ తన సినిమా ఆడియో వేడుకకు పవన్ కల్యాణ్‌ను పిలిపించాలని ప్లాన్ చేసుకుంటున్నారని తెలిసింది. నితిన్ పిలిస్తే తప్పకుండా పవన్ కల్యాణ్ వస్తారని తెలుస్తోంది. సెప్టెంబర్ 20వ తేదీ (అక్కినేని నాగేశ్వరావు పుట్టినరోజు)న జరుగనున్న ఆడియోకు పవన్ తప్పకవస్తారని తెలుస్తోంది. 
 
ఇక అఖిల్, నితిన్ తమ సినిమా ప్రమోషన్‌ను వెరైటీగా చేయనున్నారు. బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ చేతులారా తొలి టీజర్‌ను విడుదల చేయాలనుకుంటున్నాడు. ఇదే తరహాలో పవన్ కల్యాణ్‌‌ను ఆడియో ఫంక్షన్‌కు ఎలాగైనా రప్పించాలని నితిన్ ఉవ్విళ్లూరుతున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu