Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు నో చెప్పిన సమంత! ఎందుకు?

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు నో చెప్పిన సమంత! ఎందుకు?
, సోమవారం, 6 జులై 2015 (13:07 IST)
త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్తారింటికి దారేది సినిమాలో నటించిన సమంత రీసెంట్‌గా.. ఆయన సినిమాలో నటించేందుకు నో చెప్పిందట. అయితే ఇది లేడి ఓరియెంటెడ్ మూవీ అని.. సమంతను సెంట్రిక్ చేస్తూ తీసే సినిమా అని.. అందుకు సమంత వద్దని చెప్పేసిందట. క్రియేటివ్ డైరక్టర్ త్రివిక్రమ్ తీసే విభిన్న సినిమాలో నటించనని చెప్పడం వెనక కారణముందని.. కోలీవుడ్, టాలీవుడ్ సినిమాలు చేస్తే బిజీ బిజీగా ఉండటంతో కాల్షీట్స్ లేకుండా త్రివిక్రమ్ సినిమాను సమంత చేయలేనని చెప్పిందని సమాచారం. 
 
ప్రస్తుతానికి సమంత కోలీవుడ్ సినిమాలతో రెస్ట్ లేకుండా పనిచేస్తోంది. మరోవైపు మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాకు సంతకం చేసేసింది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమాకు కాల్షీట్స్ ఇవ్వడం కష్టమవుతుందనే ఉద్దేశంతోనే నో చెప్పిందని సమాచారం. ఇకపోతే.. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాతా మహేష్‌తో మూడోసారి ముచ్చటగా జతకట్టనుంది.

Share this Story:

Follow Webdunia telugu