Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సన్నీ లియోన్‌తో అమీర్ ఖాన్: రాఖీ సావంత్ కామెంట్స్.. పోర్న్ స్టార్‌గా మారుతుందట!

సన్నీ లియోన్‌తో అమీర్ ఖాన్: రాఖీ సావంత్ కామెంట్స్.. పోర్న్ స్టార్‌గా మారుతుందట!
, గురువారం, 11 ఫిబ్రవరి 2016 (19:02 IST)
పోర్న్ స్టార్ సన్నీలియోన్‌పై బాలీవుడ్ ఐటెంబాంబ్ రాఖీ సావంత్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడింది. సన్నీలియోన్ రాకతో రాఖీ సావంత్‌కు అవకాశాలు తగ్గిపోయాయనే అక్కసు కారణంగా సన్నీ అంటే ఆమెకు పడదని ఓ రూమర్ ఉన్న నేపథ్యంలో.. రాఖీ మాత్రం సన్నీని ఏదోక విధంగా ఇండియా నుంచి పంపేయాలని కాచుకుకూర్చుంది. 
 
రాఖీ సావంత్ గతేడాది ఓ సందర్భంలో సన్నీ లియోన్ గురించి మాట్లాడుతూ, ఓ పోర్న్ స్టార్‌తో పోటీపడేందుకు తాను పోర్న్ స్టార్‌గా మారనని చెప్పింది. అయితే తాజాగా ముంబైలో రాకీ సావంత్ ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా సన్నీలియోన్‌తో నటించేందుకు అమీర్ ఖాన్ అభ్యంతరం లేదని చెప్పడంపై మీ స్పందన ఏంటి? అని ఆమెను మీడియా ప్రశ్నించింది. 
 
దీనికి రాఖీ సావంత్ సమాధానమిస్తూ.. మీడియా మిత్రులందరికీ త్వరలో శుభవార్త చెప్పాలనుకుంటున్నానని ప్రారంభించి.. త్వరలో పోర్న్ స్టార్‌గా మారుతానని కామెంట్ చేసింది. ఈ కామెంట్స్ వెనుక అర్థమేమిటంటే.. అమీర్ ఖాన్.. సన్నీతో నటించేందుకు అభ్యంతరం లేదని చెప్పడమేనని సినీ పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu