Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హార్రర్ మూవీలో నారా రోహిత్ హీరోయిన్... భయపెడుతుందా..?

హార్రర్ మూవీలో నారా రోహిత్ హీరోయిన్... భయపెడుతుందా..?
, శనివారం, 4 జులై 2015 (14:23 IST)
ఇటీవల కోలీవుడ్‌లో దెయ్యాల సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. ఇదే సమయంలో తమిళ సినిమాల డబ్బింగ్ పుణ్యమా అంటూ టాలీవుడ్‌లో కూడా హార్రర్ చిత్రాలు వస్తున్నాయి. తక్కువ బడ్జెట్ సరిపోవడమే కాకుండా భారీ వసూళ్లను రాబట్టుతుండడంతో హార్రర్ చిత్రాలు ఎక్కువగా తీస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... ఆ మధ్య టాలీవుడ్‌లో విడుదలైన 'రౌడీ ఫెలో' చిత్రంలో యంగ్ హీరో నారా రోహిత్‌కు జోడీగా నటించిన భామ విశాకా సింగ్. 
 
ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఆమెకు మాత్రం మంచి పేరును తెచ్చిపెట్టింది. తాజాగా తమిళంలో రూపొందుతోన్న హార్రర్ చిత్రంలో విశాకా సింగ్ నటించనుంది. దర్శకుడు మణిశర్మ తెరకెక్కించనున్న ఈ హార్రర్  సినిమాలో ప్రధాన పాత్రకుగాను విశాకా సింగ్ ఎంపిక చేశారు. ఈ సినిమా తన కెరియర్‌పై మంచి ప్రభావం చూపుతుందని విశాకా సింగ్ విశ్వాసం వ్యక్తంచేస్తోంది. కాగా ఈ చిత్రంలో అమ్మడు భయపెడుతుందో? లేక భయపడుతుందో? వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu