Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'కిల్లింగ్ వీరప్పన్' నాకు చూపించిన తర్వాతే... వర్మకు వీరప్పన్ భార్య షాక్

'కిల్లింగ్ వీరప్పన్' నాకు చూపించిన తర్వాతే... వర్మకు వీరప్పన్ భార్య షాక్
, శుక్రవారం, 27 నవంబరు 2015 (20:15 IST)
రామ్‌‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో కిల్లింగ్‌ వీరప్పన్‌ చిత్రం రూపొందింది. ఈ చిత్రం గురించి వీరప్పన్‌ భార్యను సంబంధీకులను కలిసి సమాచారం సేకరించానని వర్మ అప్పట్లో వెల్లడించారు. ఆయన భార్య కూడా పాజిటివ్‌గా స్పందించింది. కానీ ఇప్పుడు వర్మపై విరుచుకుపడుతుంది. ఈ సినిమా డిసెంబర్‌ 4వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. కాగా సినిమా రిలీజ్‌కు సరిగ్గా వారం ఉందనగా, వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి సినిమా విడుదలకు దగ్గరైన సమయంలో సినిమాపై బ్యాన్‌ విధించాలంటూ డిమాండ్‌ చేశారు. 
 
రామ్‌‌గోపాల్‌ వర్మ హిందీలో మాత్రమే ఈ సినిమా చేస్తానని మాటిచ్చి ఇప్పుడు ఇన్ని భాషల్లో తీశారని, తమ భాషలోనూ సినిమా విడుదలవుతున్నందున తమ కుటుంబానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. తనకు పూర్తి సినిమా చూపించాలని ముత్తులక్ష్మి ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. మరి ఈ డిమాండ్‌పై వర్మ టీం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.
 
దక్షిణ భారతదేశంలోని రెండు రాష్ట్రాల పోలీసులను వణికించిన స్మగ్లర్‌ వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్‌ కథతో రూపొందిన సినిమా కావడంతో కిల్లింగ్‌ వీరప్పన్‌పై మొదట్నుంచే విపరీతమైన క్రేజ్‌ కనిపిస్తూ వచ్చింది. వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్‌గా కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌ నటించడం కూడా ఈ సినిమాకు ఓ హైలైట్‌.

Share this Story:

Follow Webdunia telugu