Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దసరా రేస్ నుంచి తప్పుకున్న వరుణ్ తేజ్ - క్రిష్ చిత్రం 'కంచె'

దసరా రేస్ నుంచి తప్పుకున్న వరుణ్ తేజ్ - క్రిష్ చిత్రం 'కంచె'
, బుధవారం, 23 సెప్టెంబరు 2015 (11:59 IST)
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కంచె'. ఈ చిత్రం రెండవ ప్రపంచ యుద్ద నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, ఆడియో, ట్రైలర్ అభిమానులతో పాటు ప్రముఖులను సైతం ఎంతగానే ఆకర్షించాయి. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి.
 
 
ఈ నేపథ్యంలో అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి సందర్భంగా 'కంచె' రిలీజ్ చేయనున్నట్టు ఈ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ వాయిదా వేసినట్లు హీరో వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో తెలియజేశాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నట్టు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu