Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నడంలో సోగ్గాడే చిన్ని నాయన రీమేక్: రమ్యకృష్ణ రోల్‌లో ప్రేమ.. నాగ్‌ పాత్రలో ఉపేంద్ర!!

కన్నడంలో సోగ్గాడే చిన్ని నాయన రీమేక్: రమ్యకృష్ణ రోల్‌లో ప్రేమ.. నాగ్‌ పాత్రలో ఉపేంద్ర!!
, బుధవారం, 25 మే 2016 (16:35 IST)
టాలీవుడ్ మన్మథుడు, అక్కినేని నాగేశ్వరరావు వారసుడు అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సంక్రాంతి రిలీజై.. హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభియనంతో మెప్పించాడు. ఇందులో రమ్యకృష్ణ తండ్రి రోల్‌గా నటించిన నాగార్జున సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. తనయుడి రోల్‌లో కనిపించిన నాగార్జున సరసన లావణ్య త్రిపాఠి నటించిన సంగతి తెలిసిందే.
 
ప్రస్తుతం ఈ సినిమా కన్నడంలోకి రీమేక్ కానుంది. కన్నడ రీమేక్‌లో నాగార్జున పాత్రను కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర పోషించనుండగా, రమ్యకృష్ణ రోల్‌‌లో మాజీ హీరోయిన్ ప్రేమ నటించనుందని శాండిల్‌వుడ్ వర్గాల సమాచారం. కన్నడ నటి అయిన ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల వైపు కన్నెత్తి చూడలేదు. అయితే భర్త నుంచి ఇటీవలే విడాకులు తీసుకున్న ఈమె త్వరలో సెకండ్ ఇన్నింగ్స్‌ను అదరగొట్టాలని డిసైడ్ అయ్యింది.
 
అందుకే వచ్చే సినీ ఛాన్సుల్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. విక్టరీ వెంకటేష్ సినిమాతో తెలుగులో పరిచయమైన ప్రేమను, వెంకటేష్ హీరోయిన్‌గా పిలుస్తుంటారు. ప్రేమ తెలుగులో దేవి, ధర్మచక్రం వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రముఖి 2లో అనుష్క, లారెన్స్-మరి రజినీకాంత్ వుండరా?! వాసుకు హిట్ ఖాయమా?!