Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగులో 'ఉపేంద్ర-2' రెడీ అవుతోంది...

తెలుగులో 'ఉపేంద్ర-2' రెడీ అవుతోంది...
, శనివారం, 1 ఆగస్టు 2015 (21:01 IST)
కన్నడ స్టార్‌ ఉపేంద్రకు తెలుగులోనూ ఫాలోయింగ్‌ వుంది. అప్పట్లో 'ఎ', 'ఉపేంద్ర', 'ఱా' చిత్రాలతో భిన్నమైన నటుడిగా పేరుపొందాడు. 1999లో ఉపేంద్ర సినిమా వచ్చింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఉపేంద్ర-2 రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం కన్నడలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో నల్లమలుపు బుజ్జి విడుదల చేస్తున్నాడు.
 
ప్రత్యేకత ఏమంటే.. బుజ్జి కెరీర్‌ ఉపేంద్ర నటించిన 'రా'తో మొదలైంది. మళ్ళీ ఇన్నాళ్ళకు ఆయన సినిమాను విడుదల చేయడం ఆనందంగా వుందని చెబుతున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తయి, పోస్ట్‌ప్రొడక్షన్‌ జరుగుతోంది. త్వరలో విడుదల చేయనున్నామని తెలిపారు. ఈ చిత్రానికి హీరో, దర్శకత్వం అన్నీ ఉపేంద్రనే..

Share this Story:

Follow Webdunia telugu