Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''భాగమతి''లో జనతా గ్యారేజ్ యంగ్ విలన్.. దేవసేన సరసన ఛాన్స్‌‌పై ముకుందన్ హ్యాపీ!

''పిల్ల జమీందార్'' ఫేమ్ అశోక్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ భాగమతిలో.. జనతా గ్యారేజ్ యంగ్ విలన్ హీరోగా కనిపిస్తాడని తెలిసింది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి లీడ్ రోల్ చేస

''భాగమతి''లో జనతా గ్యారేజ్ యంగ్ విలన్.. దేవసేన సరసన ఛాన్స్‌‌పై ముకుందన్ హ్యాపీ!
, గురువారం, 21 జులై 2016 (14:17 IST)
''పిల్ల జమీందార్'' ఫేమ్ అశోక్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ భాగమతిలో.. జనతా గ్యారేజ్ యంగ్ విలన్ హీరోగా కనిపిస్తాడని తెలిసింది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి లీడ్ రోల్ చేస్తుండగా, యంగ్ మలయాళీ యాక్టర్ ముకుందన్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తాడని తెలిసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్, నిత్యామీనన్‌తో పాటు ముకుందన్ కూడా విలన్‌గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కాకముందే ముకుందన్‌‍కు భాగమతిలో నటించే ఛాన్స్ వచ్చింది. 
 
ఈ అవకాశం లభించడం పట్ల ముకుందన్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడట. అదీ అనుష్క సరసన నటించేందుకు అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాడట. గత మూడేళ్ళుగా చర్చల్లో ఉన్న ''భాగమతి'' ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రభాస్‌ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రి పది గంటల తరువాత అదృశ్యమయ్యే అద్భుత శివాలయం.. ఎక్కడ?