Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నదియాను త్రివిక్రమ్ ఓల్డ్ లేడీ అంటారా..? ఎందుకో మీకు తెలుసా?

నదియాను త్రివిక్రమ్ ఓల్డ్ లేడీ అంటారా..? ఎందుకో మీకు తెలుసా?
, సోమవారం, 18 ఏప్రియల్ 2016 (15:01 IST)
''అత్తారింటికి దారేది'' సినిమాల్లో నటించి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన 90టీస్ గ్లామర్ తార నదియాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓల్డ్ లేడీ అని పిలుస్తారట. అలా త్రివిక్రమ్ ఎందుకు పిలుస్తాడోననే సందేహం అందరిలో ఉన్నది. ఆ డౌట్ మీలోనూ ఉంటే ఈ స్టోరీ చదవండి. త్రివిక్రమ్ నదియాకు సెకండ్ ఇన్నింగ్స్‌కు ప్రధాన కారణమయ్యాడు. ఒకప్పుడు సూపర్ హీరోయిన్‌గా పేరు తెచ్చిన నదియా నటనకు మంచి స్కోప్ ఉందనే రెండో ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టాడు. 
 
ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నదియా తాను లేటెస్ట్‌గా నటిస్తున్న ‘అ ఆ’ సినిమా విశేషాలతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తనకున్న అనుబంధాన్ని నదియా వివరించింది. 
 
‘అ ఆ’ సినిమాలో సమంతకు తల్లిగా నటిస్తున్న తన పాత్ర గురించి వివరిస్తూ ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని సునంద పాత్రలా ‘అ ఆ’ సినిమాలో కూడ తన పాత్ర ఉంటుంది అని చెప్పింది. అయితే ఈ సినిమాలో తన పాత్ర మటుకు కొంత కామిక్ టచ్‌తో హాస్యంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. 
 
దర్శకుడు త్రివిక్రమ్ తనను ఎప్పుడూ ‘ఓల్డ్ లేడీ’ అంటూ ఆట పట్టిస్తూ తనను పిలిచిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది. దీనితో షాక్ అయిన నదియా త్రివిక్రమ్ అలా ఎందుకు పిలుస్తున్నారో అర్ధంకాక ఒకసారి ధైర్యం చేసి తాను త్రివిక్రమ్ ను అడిగితే త్రివిక్రమ్ చెప్పిన విషయం విని తన మైండ్ బ్లాంక్ అయింది అని అంటోంది నదియా.  
 
త్రివిక్రమ్ అలా పిలవడంలో ఒక కారణం ఉందట. నదియా మంచి టాలెంట్ ఉన్న నటి కావడంతో ఆమె తనకు 80 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు సినిమాలలో నటిస్తూనే ఉండాలనే కోరికతో తాను అలా నదియాను ‘ఓల్డ్ లేడీ’ అని అభిమానంగా పిలుస్తున్నాను అని చెప్పి షాక్ ఇచ్చాడట. మరి నదియాకు 80 ఏళ్ల వరకు సినిమా ఛాన్సులు ఎవరిస్తారనేది వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu