Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవును పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాను : త్రిష కౌంటర్

Advertiesment
trisha
తన గురించి, తన వివాహం, సినీ కెరీర్‌కు స్వస్తి పలకడం తదితర విషయాలపై సోషల్ మీడియాలో వేదికగా సాగుతున్న ప్రచారంపై హీరోయిన్ త్రిష స్పందించారు. ఔను.. సినిమా కెరీర్‌కు స్వస్తి చెప్పి ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుని నలుగురు పిల్లలను కన్నాను అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ప్రముఖ హీరోయిన్ త్రిష సినిమా  కెరీర్‌కు స్వస్తి చెబుతున్నారంటూ సినీ నిర్మాత, నటుడు చిత్రా లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటికి త్రిష గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీని పోస్ట్ చేశారు. 
 
'ఔను సినిమాలు మానేశాను. ఒక పెద్ద వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని నలుగురు పిల్లల్ని కన్నాను. మీ ఊహాగానాలకు ఇది సరిపోతుందా?. ఈరోజు మీరు వార్తలు రాసుకోవడానికి ఇది చాలా.. మరేదైనా జోడించమంటారా' అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. దీంతో ఆమె సినిమాలు మానేయనున్నారంటూ వస్తోన్న వార్తలకు చెక్‌ పడినట్లైంది.
 
యూట్యూబ్‌ వేదికగా ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు చిత్రా లక్ష్మణన్‌ బదులిచ్చారు. ఇకపై సినిమాల్లో కొనసాగాలని త్రిష అనుకోవడం లేదని.. అవకాశాలనూ అందిపుచ్చుకోవడం లేదన్నారు. దీంతో ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమె పాలిటిక్స్‌పై ఫోకస్‌ పెట్టనున్నారని వార్తలు వచ్చాయి. తాజా పోస్ట్‌తో వీటికి తనదైన స్టైల్‌లో త్రిష బదులిచ్చారు. ప్రస్తుతం ఆమె సూర్యతో 'కరుప్పు', చిరంజీవితో 'విశ్వంభర' చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతిని ఏకైక రాజధాని.. ఏపీ ప్రజలందరికీ ఒక చారిత్రాత్మక విజయ క్షణం.బాలకృష్ణ