Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవికా గోర్‌కి పెరుగుతున్న డిమాండ్: నిఖిల్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశాల వెల్లువ!!

అవికా గోర్‌కి పెరుగుతున్న డిమాండ్: నిఖిల్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశాల వెల్లువ!!
, గురువారం, 26 నవంబరు 2015 (13:38 IST)
ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మావ సినిమాలతో హిట్స్ ఖాతాలో వేసుకున్న అవికా గోర్‌కి బాగా డిమాండ్ పెరుగుతోంది. చిన్న సినిమాలైనప్పటికీ మంచి కథతో, నటనతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న అవికా గోర్.. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న నిఖిల్ సినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్సును కొట్టేసింది. బుల్లితెరపై కావలసినంత క్రేజ్‌ను మూటగట్టుకుని వెండితెరపైకి వచ్చిన ఈ సూపర్ గర్ల్.. 'తను-నేను' సినిమాతోనూ హిట్ కొడుతుందని సినీ పండితులు అంటున్నారు. ఈ సినిమా 27న రిలీజ్ కానుంది.
 
అలాగే వచ్చేనెలలో విడుదలకి 'మాంజ' సిద్ధమవుతోంది. అలా ఆమె ఈ సంవత్సరం వరుసగా మూడు సినిమాలు చేసింది. ఇలా కొత్త కథలతో యంగ్ హీరోలతో ఓకే అనిపించుకున్న దర్శక నిర్మాతలు ముందుగా అవికా గోర్‌నే సంప్రదిస్తున్నారట. యూత్‌లో అవికా గోర్‌కి మాంచి క్రేజుండటంతో ఆమెకు బాగానే డిమాండ్ పెరుగుతుందని సినీ పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu