Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ సినిమాలో ఉపేంద్ర.. కీర్తిసురేష్, అనుఇమ్మానుయేల్‌తో పవర్ స్టార్ రొమాన్స్

పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకునే సినిమాకు సంబంధించి చాలా ఆసక్తికర వార్తలొస్తున్నాయి. ‘దేవుడే దిగివచ్చినా’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడ

పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ సినిమాలో ఉపేంద్ర.. కీర్తిసురేష్, అనుఇమ్మానుయేల్‌తో పవర్ స్టార్ రొమాన్స్
, బుధవారం, 21 డిశెంబరు 2016 (09:30 IST)
పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకునే సినిమాకు సంబంధించి చాలా ఆసక్తికర వార్తలొస్తున్నాయి. ‘దేవుడే దిగివచ్చినా’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలుకానున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం దక్షిణాదికి చెందిన పలువురు తారలు నటిస్తున్నారని టాక్ వచ్చింది. ఈ సినిమాలో కన్నడ స్టార్‌హీరో ఉపేంద్ర నటిస్తున్నాడట. ఉపేంద్ర ఇంతకుముందే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే.
 
ప్రస్తుతం మరోసారి త్రివిక్రమ్‌ చెప్పిన స్ర్కిప్టు నచ్చడంతో పవన్‌తో నటించేందుకు ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఉపేంద్రది చాలా కీలకమైన పాత్రట. అలాగే ‘అత్తారింటికే దారేది’ సినిమాలో నటించిన బాలీవుడ్‌ ప్రముఖుడు బొమన్‌ ఇరానీ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడట. తమిళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కీర్తిసురేష్‌తోపాటు మలయాళీ బ్యూటీ అనుఇమ్మానుయేల్‌ కూడా నటిస్తున్నట్టు తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'వంగవీటి' చూస్తే ఏమనిపిస్తుందో... రేవంత్ రెడ్డి