Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'టిప్పు సుల్తాన్' జీవిత చరిత్ర వెండితెరపై చూడాలన్నది రజనీకాంత్ కోరిక : అశోక్ ఖేని

'టిప్పు సుల్తాన్' జీవిత చరిత్ర వెండితెరపై చూడాలన్నది రజనీకాంత్ కోరిక : అశోక్ ఖేని
, మంగళవారం, 22 సెప్టెంబరు 2015 (11:27 IST)
కన్నడ నిర్మాత అశోక్ ఖేని మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రజనీకాంత్‌ను టిప్పు సుల్తాన్ పాత్రలో చూడాలని అనుకుంటున్నట్టు వ్యాఖ్యలు సంచలనం రేపారు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంస్థలు తీవ్రంగా మండిపడటమేకాకుండా రజనీకాంత్‌కు హెచ్చరికలు కూడా జారీచేశాయి.
 
 
ఈ నేపథ్యంలో అశోక్ ఖేని తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. టిప్పు సుల్తాన్ జీవిత చిత్రను వెండితెరపై ఆవిష్కరించాలన్నది రజనీకాంత్ అభీష్టమేనని అశోక్ ఖేని వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని పారిపాలించిన గొప్ప రాజుల్లో టిప్పు సుల్తాన్ ఒకరని, ఆయన హిందూ మతాన్ని గానీ, హిందువులను గానీ ఏనాడూ తక్కువ చేసి చూడలేదని గుర్తు చేశారు. 
 
అంతేకాకుండా, ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తానని చెప్పారు. అయితే, ఈ చిత్ర స్క్రిప్టు సిద్ధమయ్యేందుకు మరో యేడాది సమయం పడుతుందని అశోక్ ఖేని చెప్పుకొచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu