Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Raaka: అల్లు అర్జున్ #AA22xA6 ఫస్ట్-లుక్ టైటిల్ ఇదే

Advertiesment
AA 22 Title look Raaka
AA 22 Title look Raaka
అల్లు అర్జున్ #AA22xA6 చిత్రం టైటిల్ ను ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ రాకా అంటూ ఖరారు చేసింది. గుండు గీసుకుని వున్న ఆ ఫొటోలో చేతికి అడవిమనిషి గోల్ళుగా వున్నట్లు చూపించారు. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ముందుగా ప్రకటించినట్లు ఈరోజు పగలు 11.05 నిముషాలకు సోషల్ మీడియాలో రాకా అంటూ వెల్లడించారు. దీనితో అభిమానులు ఫిదా అయిపోయారు. అల్లు అర్జున్ గుర్తుపట్టలేనంతగా రాకా ఫస్ట్ లుక్ లో ఆకట్టుకున్నారు.
 
సన్ పిక్చర్స్, పాన్-ఇండియా సై-ఫై థ్రిల్లర్ రాకా టైటిల్ లోని పోస్టర్  భయంకరమైన రాక్షసుడిని సూచిస్తోంది. 43వ ఏట అడుగుపెడుతున్న అల్లు అర్జున్‌కు పుట్టినరోజు కానుకగా, పూర్తి టైటిల్ విడుదల చేశారు. ఈ వార్తను అల్లు అర్జున్ స్వయంగా పంచుకోగా అభిమానులు ఎడిట్‌లు, మీమ్‌లతో పాటు మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి ప్రత్యర్థుల మద్దతుదారుల నుండి హృదయపూర్వక శుభాకాంక్షలతో సంబరాలు చేసుకున్నారు. రూ. 800 కోట్లకు పైగా బడ్జెట్‌తో చిత్రీకరిస్తున్న రాకా చిత్రం, అట్లీ 'జవాన్' విజయం తర్వాత వస్తోంది మరియు 'పుష్ప 2' తర్వాత రికార్డులు సృష్టించే చిత్రంగా నిలుస్తోందని అభిమానులు తెలియజేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Venkatesh: ఐదు సినిమాలు చేస్తే చాలనుకున్న నన్ను నిలబెట్టింది వారే : అడివి శేష్