Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

Advertiesment
K. Raghavendra Rao Unveils 'Diamond Decoy' Trailer
K. Raghavendra Rao Unveils 'Diamond Decoy' Trailer
డైమండ్ డెకాయిట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు ట్రైలర్‌ను వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించారు. ఏప్రిల్‌ 10న విడుదల కాబోతుంది. ఈ ప్రత్యేక సందర్భంలో చిత్ర యూనిట్ మహిళా ప్రేక్షకులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల కానున్న థియేటర్లలో 4 షోలు మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. మహిళలు ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు వచ్చి సినిమా ఆస్వాదించాలని చిత్ర బృందం కోరుతోంది.
 
ఈ చిత్రంలో పార్ధా గోపాల్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరించగా, మేఘనా రెడ్డి హీరోయిన్‌గా నటించారు. రచయిత–దర్శకుడు సూర్య జి. యాదవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పూర్తి కుటుంబ వినోదంతో పాటు హృద్యమైన భావోద్వేగాలతో కూడిన ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది.
 
ఈ సందర్భంగా హీరో–నిర్మాత పార్ధా గోపాల్ మాట్లాడుతూ,  డైమండ్ డెకాయిట్ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ప్రతి కుటుంబం కనెక్ట్ అయ్యేలా కథ ఉంటుంది. కడపలో చిత్రీకరించిన అందమైన లొకేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహిళలకు 4 షోలు ఉచితంగా ఏర్పాటు చేశాం. అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలి” అని అన్నారు.
 
దర్శకుడు సూర్య జి. యాదవ్ మాట్లాడుతూ, ఈ సినిమాలో భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాం. పూర్తిగా కడప జిల్లాలోనే చిత్రీకరించిన తొలి చిత్రం కావడం మా గర్వకారణం. ప్రేక్షకులందరూ థియేటర్లలో చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
 
ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే, 60కి పైగా అందమైన కడప జిల్లా లొకేషన్లలో పూర్తిగా చిత్రీకరించడం. ఈ విజువల్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనున్నాయి. కథనం, సహజమైన లొకేషన్లు, హృద్యమైన భావోద్వేగ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్ర బృందం తెలిపింది. ఏప్రిల్‌ 10న విడుదలయ్యే ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి మహిళల కోసం ప్రకటించిన ప్రత్యేక ఆఫర్‌ను వినియోగించుకోవాలని యూనిట్ ఆహ్వానిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్