Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎందుకొచ్చిన గొడవ... నోరు మూసుకుంటేనే మేలు... సల్మాన్ ఖాన్

ఎందుకొచ్చిన గొడవ... నోరు మూసుకుంటేనే మేలు... సల్మాన్ ఖాన్
, శుక్రవారం, 24 జూన్ 2016 (18:47 IST)
'రేప్ కాబడిన మహిళలా నా పరిస్థితి తయారైంద'ని చెప్పి దేశంలో విమర్శల పాలైన సల్మాన్ ఖాన్ ఈ అంశంపై మాట్లాడాడు. తను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పిన సల్మాన్, ఇకపై నేను సాధ్యమైనంత తక్కువగా మాట్లాడటం మంచిదనుకుంటున్నట్లు వెల్లడించారు. చాలామటుకు నోరు మూసుకుని ఉండటం బెటర్ అని అనుకుంటున్నట్లు వివరించాడు.
 
కాగా సుల్తాన్ సినిమా షూటింగ్‌ సమయంలో కుస్తీ ఫీట్లు చేసినప్పుడు ఎలా ఫీలయ్యారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సల్మాన్ చెప్పిన సమాధానం దుమారం లేపింది. షూటింగ్ ముగిసి బయటకు వచ్చేసరికి తను అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితిని అనుభవించానంటూ సల్మాన్ వ్యాఖ్యానించడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. సల్మాన్ కుటుంబ సభ్యులు సల్మాన్ తరపున క్షమాపణలు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సహజీవనం.. ఓ ఫ్యాషనా? మగవాళ్ల దగ్గర ఉండే ఆ సుఖం.. ఆడవాళ్ల దగ్గర ఉండదట.. క్రిస్టీన్ స్టీవర్ట్