రాజీవ్ సాలూరి, యామిని భాస్కర్ హీరో హీరోయిన్లుగా కన్నా సినీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నూతన చిత్రం ‘టైటానిక్’. ‘అంతర్వేది టు అమలాపురం’ ట్యాగ్ లైన్. వినోద్ యాజమాన్య సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. రాజవంశీ దర్శకుడు. కె.శ్రీనివాసరావు నిర్మాత.
బిగ్ సీడీని అనిల్ రావిపూడి ఆవిష్కరించారు. ఆడియో సీడీలను ఎన్.శంకర్ విడుదల చేయగా తొలి సీడీని కె.ఎల్.దామోదర్ ప్రసాద్ అందుకున్నారు. చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ''టైటానిక్'' చిత్రం ఫుల్ ఫ్యామిలీ కామెడి ఎంటర్‌టైనర్. ‘అంతర్వేది నుండి అమలాపురం’ వరకు గోదావరి నదిలో టైటానిక్ అనే లాంచీలో జరిగే కథే ఇది. పెళ్ళి బృందం కామెడితో సినిమా సరదాగా సాగుతుంది.
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇందులో పెళ్ళి కొడుకుగా నటిం,డేజ రాజీవ్ సాలూరి హీరోగా నటిస్తున్నాడు. రఘుబాబు విలన్‌గా నటిం,డేజ అలాగే జబర్‌దస్త్ టీం కామెడి సినిమాకు ప్లస్ అవుతుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవుతుంది. వినోద్ యాజమాన్య మంచి మ్యూజిక్ అందించారు’’ అన్నారు.