Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిక్ 2తో చెయ్యి కాలింది.. ఇక షేర్ అంటోన్న కళ్యాణ్ రామ్

కిక్ 2తో చెయ్యి కాలింది.. ఇక షేర్ అంటోన్న కళ్యాణ్ రామ్
, మంగళవారం, 6 అక్టోబరు 2015 (11:20 IST)
నందమూరి కళ్యాణ్‌రామ్‌ పటాస్‌ తర్వాత ముందగులు వేస్తున్నాడు. తాజాగా కొత్త కథల్ని వినడం.. నచ్చితే వెంటనే అడ్వాన్స్‌లు ఇచ్చేయం జరుగుతుంది. తాజాగా 'షేర్‌' చిత్రాన్ని చేశాడు. ఈనెల 10న ఆడియోను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇదిలావుంటే. కిక్‌2 సినిమాతో కాస్త నష్టపోయిన కళ్యాణ్‌రామ్‌ మరో కొత్త ప్రయోగం చేయడానికి ఆలోచిస్తున్నాడు. నష్టపోయినా సరే  ఆ వెంటనే మరో కొత్త సినిమా చేయడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నట్టు తెలిసింది. 
 
ఈసారి వీరు పోట్ల దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్‌ నటించనున్నట్టు సమాచారం. బిందాస్‌, రగడ, దూసుకెళ్తా సినిమాలతో మంచి దర్శకుడు అని నిరూపించుకొన్నాడు వీరుపోట్ల. తదుపరి బిందాస్‌2 చేస్తాడని ప్రచారం సాగింది. అయితే ఇంతలోనే కళ్యాణ్‌రామ్‌కి వీరుపోట్ల కథ చెప్పాడట. కథ నచ్చడంతో కళ్యాణ్‌రామ్‌ వెంటనే  గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడని తెలిసింది.
 
షేర్‌  ప్రేక్షకుల ముందుకొచ్చిన వెంటనే కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టే ఆవకాశాలున్నట్టు తెలిసింది. బిందాస్‌ అవకాశాన్ని ఆ తర్వాత చేసిన రగడ, దూసుకెళ్తా చిత్రాల్తో దర్శకుడు సక్సెస్‌ సాధించలేకపోయాడు. ఇంతకుముందు రవితేజకు వీరు కధచెప్పడం. ఆయన తిరస్కరించడం జరిగింది. కానీ కళ్యాణ్‌రామ్‌కు నచ్చడం ఆశ్చర్యంగా వుందని ఫిలింనగర్‌ కథనాలు విన్పిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu