Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా హీరోలకు గుర్తింపు ఎక్కడ? తెలంగాణ వారిని చిన్న చూపు చూస్తున్న ఛాంబర్‌

తెలంగాణ వారిని ఇప్పుడున్న ఛాంబర్‌ చిన్నచూపుచూస్తుందని తెలంగాణా నిర్మాత రామకృష్ణ గౌడ్‌ విమర్శించారు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, తెలంగాణ తొలి సినిమా హీరో, నటుడు, నిర్మాత, దర్శకుడు పైడి జయరాజ్‌ 1

మా హీరోలకు గుర్తింపు ఎక్కడ? తెలంగాణ వారిని చిన్న చూపు చూస్తున్న ఛాంబర్‌
, బుధవారం, 28 సెప్టెంబరు 2016 (19:58 IST)
తెలంగాణ వారిని ఇప్పుడున్న ఛాంబర్‌ చిన్నచూపుచూస్తుందని తెలంగాణా నిర్మాత రామకృష్ణ గౌడ్‌ విమర్శించారు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, తెలంగాణ తొలి సినిమా హీరో, నటుడు, నిర్మాత, దర్శకుడు పైడి జయరాజ్‌ 107వ జయంతి వేడుకలు బుధవారం ఫిలింఛాంబర్‌లో నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత ప్రతాని రామకష్ణ గౌడ్‌ మాట్లాడుతూ.. పైడి జయరాజ్‌, ఆ రోజుల్లోనే ముంబై వెళ్లి అక్కడ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో అయన పేరు వినిపించడం లేదు. అయన గురించి అందరికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
 
నిజానికి అయన పుట్టిన రోజు వేడుకలను ఫిలిం ఛాంబర్‌ చేయాలి కానీ, వారు తెలంగాణ వాళ్ళను పట్టించుకోరు, వాళ్లకు వాళ్ళ వర్గం వాళ్లకు, లేదా వాళ్ళ ప్రాంతం వారిపట్ల మాత్రమే ప్రేమ ఉంటుంది. తెలంగాణ వచ్చి ఇన్ని రోజులు అయినా కూడా ఇంకా తెలుగు సినిమాలో తెలంగాణ వారిని చిన్న చూపు చూస్తున్నారని' అన్నారు. 
 
దర్శకుడు బాబ్జి మాట్లాడుతూ నిజాం కాలంలోనే తెలంగాణాలో మనుషులు ఎలా బతకాలో అని ఆలోచిస్తున్న రోజుల్లోనే ముంబై వెళ్లి అక్కడ హీరోగా నిలబడ్డాడు ఓ తెలంగాణ వ్యక్తి, అయన చరిత్రను ఇక్కడ తెలుగు పరిశ్రమ వారు పట్టించుకోవడం లేదు. ఆయన చరిత్ర భావి తరాలకు తెలియాలి. ఫిలిం నగర్‌లో అయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, దానికోసం అందరం ప్రయత్నం చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో జైహింద్‌ గౌడ్‌, మోహన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్ను చూసి బాలీవుడ్‌ హీరోలు గెడ్డాలు పెంచుకున్నారు: రామ్ రహీమ్ సింగ్ ఇన్‌శాన్