Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాల్ సినిమా ప్రమోషన్‍కు రావాలా? ఐతే డబ్బివ్వండి గురూ.. తమన్నా

బాహుబలి సినిమాకు తర్వాత తెల్లపిల్ల తమన్నా బాగా బిజీ అయిపోయింది. ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అమ్మడికి బాగా డబ్బు పిచ్చి కూడా పట్టిందని సినీ జనం అంటున్నారు. ఇప్పటికే అవకాశాలు పెరగడంతో రెమ్యూనరేషన

విశాల్ సినిమా ప్రమోషన్‍కు రావాలా? ఐతే డబ్బివ్వండి గురూ.. తమన్నా
, శనివారం, 27 ఆగస్టు 2016 (14:27 IST)
బాహుబలి సినిమాకు తర్వాత తెల్లపిల్ల తమన్నా బాగా బిజీ అయిపోయింది. ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అమ్మడికి బాగా డబ్బు పిచ్చి కూడా పట్టిందని సినీ జనం అంటున్నారు. ఇప్పటికే అవకాశాలు పెరగడంతో రెమ్యూనరేషన్‌ను పెంచేసిన తమన్నా.. ప్రస్తుతం తమిళంలో విశాల్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్‌కు రావాలని తమన్నాను పిలిస్తే.. అమ్మడు నో చెప్పిందట.
 
అయినా తమన్నా వస్తే బాగుండునని విశాల్ అండ్ టీమ్ ఒత్తిడి చేయడంతో.. ప్రమోషన్‌కు అదనంగా డబ్బివ్వాలని తమన్నా డిమాండ్ చేస్తున్నట్లు కోలీవుడ్‌ సమాచారం. విజయ్ సేతుపతితో నటించిన ధర్మదురై సినిమా ప్రమోషన్‌కు కూడా అమ్మడు డబ్బు డిమాండ్ చేసిందని కోలీవుడ్ జనం అనుకుంటున్నారు. 
 
కాగా విశాల్‌తో తమన్నా నటించే కత్తిసండై చిత్రాన్ని మద్రాస్ ఎంటర్‌ టైన్‌మెంట్ సంస్థ అధినేత ఎస్.నందగోపాల్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సురాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతిబాబు విలన్‌‌గా నటిస్తున్నారు. ఈ నెల 29న విశాల్ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు ఆడియోను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి తమన్నాను ఆహ్వానించగా తాను ప్రచార కార్యక్రమంలో పాల్గొనని.. అలా పాల్గొంటే లాభముండాలిగా అంటోందట. మరి విశాల్ టీమ్ తమన్నాను ఎలా డీల్ చేస్తారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనతా గ్యారేజ్ పోస్టర్లలో ఎన్టీఆర్ ఏడీ...? మోహన్ లాల్ హీరోగా ప్రచారం