Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాహుబలి రేప్ సీన్ కామెంట్స్: నోరు విప్పిన తమన్నా.. సినిమాలంటే..?

బాహుబలి రేప్ సీన్ కామెంట్స్: నోరు విప్పిన తమన్నా.. సినిమాలంటే..?
, మంగళవారం, 22 సెప్టెంబరు 2015 (13:13 IST)
బాహుబలి రిలీజ్ అయ్యాక తమన్నాపై విమర్శలొచ్చాయి. పచ్చబొట్టేసిన పాటకు ముందు ప్రభాస్-తమన్నాల మధ్య చోటుచేసుకున్న సన్నివేశాలు రేప్ సీన్‌ను పోలినట్లున్నాయని విమర్శలొచ్చిన నేపథ్యంలో తమన్నా రేప్ వార్తలపై తొలిసారిగా స్పందించింది. బాహుబలిలో తమన్నా రోల్ అనవసరమని, గ్రాఫిక్స్ పెద్దగా పనిచేయలేదని ఫస్ట్ ఆఫ్ కొరతలున్నాయని.. ఇలా ఎన్నెన్నో విమర్శలొచ్చినా రాజమౌళి ఏమాత్రం పట్టించుకోని తరుణంలో తమన్నా మాత్రం నోరు విప్పింది. 
 
ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. వారి వారి అభిప్రాయాల మేరకు విమర్శలు చేసుకోవచ్చు. సినిమాలంటే ఎంటర్‌టైన్ చేయడానికే. బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టులో మహిళలన్ని జక్కన్న బ్యూటీఫుల్ మేనర్‌లోనే చూపించారు. సినిమాలు వినోదాలు పంచడానికే పరిమితమైనవని.. వాటిని లోతుగా పరిశీలించకూడదన్నదే తన అభిప్రాయమని తమన్నా చెప్పింది.
 
మొత్తానికి తమన్నా రేప్ సీనంటూ.. విమర్శలు చేసిన వారి నోళ్ళను మూయించేందుకు తనదైన స్టైల్‌లో కామెంట్స్ చేసిందని సినీ పండితులు అంటున్నారు. ఇక బాహుబలి బిగినింగ్ పూర్తయ్యాక నాగార్జున-కార్తీ మల్టీస్టారర్ ''ఊపిరి''లో నటించింది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో తమన్నా బాహుబలి- ది కన్‌క్లూజన్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu