Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమన్నాకు ఆఫర్ల వెల్లువ!

తమన్నాకు ఆఫర్ల వెల్లువ!
, సోమవారం, 24 ఆగస్టు 2015 (20:01 IST)
'బాహుబలి' చిత్రం తర్వాత పెద్ద అఫర్లు వస్తాయని భావించినట్లుగానే తమన్నాకు మంచి ఆఫర్లు వచ్చాయి. దాదాపు అన్ని భాషల్లో తమన్నా పేరు మార్మోగిపోయింది. 'బాహుబలి'తోపాటు తమిళంలో 'వాసువుం శరవణనుం ఓన్నా పడిచ్చవంగ' సినిమా చేసి హిట్‌ కొట్టేసింది. కాగా, శింబు, అమీర్‌ డైరెక్షన్‌‌లో ఓ సినిమా చెయ్యడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌‌గా తమన్నాని ఫైనలైజ్‌ చేసినట్లు సమాచారం.
 
 
త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇదికాకుండా తమన్నా ప్రస్తుతం నాగార్జున, కార్తీ కాంబినేషన్‌‌లో ఒకేసారి ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. తెలుగులో 'బెంగాల్‌ టైగర్‌' సినిమాతో పాటు 'బాహుబలి పార్ట్‌ 2' షూట్‌‌లో కూడా తమన్నా పాల్గొననుంది. 'బెంగాల్‌ టైగర్‌' దాదాపు పూర్తి కావొచ్చింది. 'బాహుబలి' వచ్చేనెలలో మొదలుకానుంది.

Share this Story:

Follow Webdunia telugu