Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫలించిన మెగాస్టార్ ప్రయత్నాలు.. సూర్య 'సింగం-3' రిలీజ్ వాయిదా.. ధృవకు తిరుగేలేదట...

మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఫలితంగా హీరో సూర్య 'సింగం 3' విడుదల వాయిదా పడింది. ముందుగా అనుకొన్న డిసెంబర్ 16న కాకుండా.. వారం రోజులు ఆలస్యంగా అంటే డిసెంబర్ 23న 'సింగం-3'వ తేదీన క్రిస్

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (12:22 IST)
మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఫలితంగా హీరో సూర్య 'సింగం 3' విడుదల వాయిదా పడింది. ముందుగా అనుకొన్న డిసెంబర్ 16న కాకుండా.. వారం రోజులు ఆలస్యంగా అంటే డిసెంబర్ 23న 'సింగం-3'వ తేదీన క్రిస్మస్ గిఫ్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో.. 'ధృవ' కలెక్షన్స్ గండికొట్టే ప్రమాదమున్న "సింగం-3"ని వాయిదా వేయాలన్న మెగా ప్రయత్నాలు ఫలించినట్టయ్యింది.
 
రాంచరణ్- సురేందర్ రెడ్డి కలయికలో తెరకెక్కిన 'ధృవ' డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ధృవకి వారం తేడాతో సూర్య 'సింగం-3' ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. టాలీవుడ్‌లోనూ సూర్యకి మంచి మార్కెట్ ఉంది. దీంతో.. ధృవ కలెక్షన్స్‌కి గండిపడటం ఖాయమని మెగా కాంపౌండ్ భావించింది. ఈ నేపథ్యంలోనే 'సింగం-3'ని వాయిదా వేయించేందుకు రాంచరణ్ మామ, ధృవ నిర్మాత రంగంలోకి దిగాడని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.
 
ఇప్పుడు సింగం-3 వాయిదా పడటంతో అల్లు అరవింద్ ప్రయత్నాలు ఫలించినట్టయ్యింది. ఇక, ఇప్పుడు ధృవకి అడ్డులేదు. ఓ 15రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర ఏక చత్రాథిపత్యం కొనసాగించొచ్చు. ఇక, హరీ దర్శకత్వంలో సింగం సిరీస్‌లో భాగంగా సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'సింగం-3'. అనుష్క, శృతిహాసన్ కథానాయికలు. ఈ మాస్ ఎంటర్టైనర్ బీ, సీ సెంటర్స్‌లలో హవా మాములుగా ఉండదు. ఓ అడుగు వెనకడుగు వేసిన సింహం పంజా విసరడం ఖాయమంటున్నారు చిత్రబృందం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments