Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎక్స్‌ప్రెస్ రాజాలో సురభి ఫైట్స్.. దుమ్మురేపిందట..!

ఎక్స్‌ప్రెస్ రాజాలో సురభి ఫైట్స్.. దుమ్మురేపిందట..!
, బుధవారం, 6 జనవరి 2016 (13:25 IST)
శర్వానంద్ తాజా సినిమా ఎక్స్‌ప్రెస్ రాజాలో హీరోయిన్ సురభి ఫైట్ చేసిందట. ఆ ఫైట్ కూడా మామూలుగా ఉండదు. హీరోలు చేసే ఫైట్లకి ధీటుగా ఉంటుందట. అదే సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం ప్రచారం చేస్తోంది. మామూలుగా అయితే సినిమాలో మా హీరో చేసిన ఫైట్లు - డ్యాన్సులు అదిరిపోయాయని చెప్పుకొంటుంటారు. కానీ ఎక్స్‌ప్రెస్ రాజా విషయంలో మాత్రం ఆ సీన్ రివర్సయ్యింది. 
 
చూడ్డానికి సుకుమారంగానే కనిపిస్తుంటుంది సురభి. మరి ఆ సుకుమారమైన అమ్మాయితో ఫైట్లు ఎలా చేయించారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్నట్టు ఆమె సినిమాలో ఫైట్లే కాదండోయ్... అందాలు కూడా బాగానే ఆరబోసిందని సినీ పండితులు అంటున్నారు. పోస్టర్లలో చిట్టిపొట్టి డ్రెస్సులేసుకొని దర్శనమిస్తోంది. మరి ఆమె యాక్షన్ - గ్లామర్ ఏ స్థాయిలో వర్కవుటవుతాయో చూడాలి. అన్నట్టు సురభి `బీరువా`లాంటి ఒక సాదాసీదా సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇచ్చినా అవకాశాల విషయంలో మాత్ర దుమ్ము దులిపేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu