Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూపర్ స్టార్.. కబాలీ సెల్ఫీ అదుర్స్.. రజినీ లుక్ ఎలా ఉందో చూడండి..

సూపర్ స్టార్.. కబాలీ సెల్ఫీ అదుర్స్.. రజినీ లుక్ ఎలా ఉందో చూడండి..
, శనివారం, 12 సెప్టెంబరు 2015 (12:37 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా కబాలీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక శంకర్ రోబో 2కు రెడీ కావాల్సి ఉండగా, రజనీకాంత్ నేచురల్‌గా, మేకప్ లేకుండా నటిస్తున్న కబాలీ సినిమాలో రజనీ కాంత్ ఆరుపదుల వృద్ధుడిగానే కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో వివిధ గెటప్‌ల్లో కనిపించే రజనీకాంత్ షూటింగ్ స్పాట్‌లో తీసిన సెల్ఫీ ట్విట్టర్లో లీక్ అయ్యింది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. 
 
రజనీ కాంత్ కబాలీ తప్పకుండా హిట్ అవుతుందని అప్పుడే జోస్యం చెప్పేస్తున్నారు. ఇప్పటికే లింగా ఫ్లాప్‌తో కష్టాల్లో ఉన్న రజనీ కాంత్ తప్పకుండా కబాలీతో మంచి హిట్ కొట్టేస్తాడని సినీ పండితులు సైతం అంటున్నారు. మరి కబాలీ ఏమేరకు కలెక్షన్స్ సాధిస్తుందో..? రజనీకాంత్‌కు హిట్ టాక్ ఇస్తుందో లేదో వేచిచూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu