Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభుదేవా చిత్రంలో మాజీ పోర్న్ స్టార్.. ఆ ఆశకు గోవాలో తొలిమెట్టు..

ప్రభుదేవా చిత్రంలో మాజీ పోర్న్ స్టార్.. ఆ ఆశకు గోవాలో తొలిమెట్టు..
, మంగళవారం, 30 జూన్ 2015 (19:03 IST)
సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి టాప్ హీరోల సరసన నటించాలన్న సన్నీ లియోన్ ఆశకు తొలి అడుగు పడింది. జిస్మ్ 2 చిత్రం ద్వారా భారత చిత్ర పరిశ్రమలోకి కాలుమోపిన మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ప్రస్తుతం దేశం ఉన్న ప్రముఖ సెలిబ్రిటీలలో ఒకరు. ఆమెను తమ చిత్రాలలో గెస్ట్ రోల్‌లో అయిన నటింప చేసి వ్యాపారాన్ని మరింత పెంచుకోవాలని అనేక మంది ఆశపడుతుంటారు.
 
అలా టాలీవుడ్ నిర్మాత దురై దయానిధి తన 'వడకరి' సినిమాలో సన్నీ లియోన్‌ను చిందులు వేయించి తన ఆశను తీర్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభుదేవా ఆ పని చేశారు. తాజా సమాచారం ఏమిటంటే.. ప్రస్తుతం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా ప్రభుదేవా నిర్మిస్తున్న 'సింగ్ ఇస్ బ్లింగ్' షూటింగ్ గోవాలో జరుగుతోంది. అక్కడికి వేరే పనిమీద సన్నీలియోన్ వచ్చింది. 
 
విషయం తెలుసుకున్న ప్రభుదేవా వెంటనే ఆమె కోసం చిత్రంలో ఒక గెస్ట్ రోల్‌ను తయారు చేయించి, అందులో ఆమెను నటింప చేశాడు. ఈ విషయాన్ని సన్నీలి తెలుపుతూ.. బిగ్ స్టార్‌ల సరసన నటించాలనే తన కోరికకు గోవాలో తొలి మెట్టు పడిందంటూ సన్నీ ఇటీవల తన ట్విట్టర్‌లో పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu