Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్నీడియోల్ సినిమాకు రాజమౌళి క్రియేటివ్ డైరక్టర్.. తండ్రికి సాయం?!

సన్నీడియోల్ సినిమాకు రాజమౌళి క్రియేటివ్ డైరక్టర్.. తండ్రికి సాయం?!
, మంగళవారం, 19 ఏప్రియల్ 2016 (13:41 IST)
బాహుబలి-2 సినిమా షూటింగ్ పనుల్లో జక్కన్న రాజమౌళి బిజీ బిజీగా ఉన్నారు. టాలీవుడ్‌లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా అయిన బాహుబలితో రికార్డు సృష్టించిన రాజమౌళి హిందీ ప్రాజెక్టు చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క లీడ్ రోల్స్లో తెరకెక్కిన బాహుబలి 600 కోట్లకు పైగా వసూళు చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న బాహుబలి 2 కూడా అదే స్థాయి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్న రాజమౌళి టీమ్‌ బాలీవుడ్ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 
 
కానీ ఈ సినిమాకు రాజమౌళి దర్శకుడు కాదు, కేవలం క్రియేటివ్ డైరెక్టర్గా తన సహాయం అందించనున్నాడు. ఇటీవల ఘాయల్ వన్స్ అగైన్ సినిమాతో నిరాశపరిచిన సన్నీడియోల్ త్వరలో మేరా భారత్ మహాన్ పేరుతో తెరకెక్కనున్న సినిమాలో హీరోగా నటించనున్నాడు.
 
ఈ సినిమాకు రాజమౌళి తండ్రి, బాహుబలి, భజరంగీ బాయిజాన్ లాంటి సక్సెస్ సినిమాల కథా రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసమే రాజమౌళి క్రియేటివ్ డైరెక్టర్గా మారుతున్నాడట. గతంలో విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన రాజన్న సినిమా కోసం కూడా కొన్ని సీన్స్ డైరెక్ట్ చేసిన జక్కన్న ప్రస్తుతం మేరా భారత్ మహాన్ సినిమా కోసం మరోసారి తండ్రికి సాయపడనున్నాడని తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu