Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Allu Arjun: #AA22xA6 గురించి సన్ పిక్చర్స్ ప్రకటన

Advertiesment
Allu Arjun, Atly, Sun pictures
Allu Arjun, Atly, Sun pictures
ఏప్రిల్ 8న 44వ పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్ తాజా సినిమా #AA22xA6 గురించి సన్ పిక్చర్స్ ప్రకటన వెలువడించింది. రేపు 11 గంటలకు హుషారైన అప్ డేట్ రాబోతుందని తెలియజేసింది. మరోవైపు దర్శకుడు అట్లీ కూడా తన సినిమా ప్రోగ్రెస్ గురించి అప్పుడు చెబుతానంటూ సోషల్ మీడియాలో వెలువరించాడు. తన 22వ సినిమా (AA22) టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. 
 
​సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. ఇందుకోసం విదేశాల్లో సైతం అవతార్ వంటి చిత్రాలకు పనిచేసిన సాంకేతిక సిబ్బంది, స్టూడియోలను సందర్శించి ప్రత్యేకంగా  డిజైన్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ కూడా సీక్రెట్ గా వుంచాలనీ, ఎటువంటి లీకేజ్ లు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు అట్లీ తెలియజేస్తున్నారు. 
 
సాధారణంగా స్టార్ హీరోల సినిమాల టైటిల్స్ ముందుగానే లీక్ అవుతుంటాయి, కానీ ఈ విషయంలో చిత్ర బృందం చాలా సీక్రెట్ మెయింటైన్ చేసింది. ఇప్పటివరకు ఎలాంటి లీకులు రాకుండా టీమ్ తీసుకున్న జాగ్రత్తలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
 
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2027 వేసవిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Dacoit: అమీర్ ఖాన్ మేనకోడలు... కెమెరామేన్ కళ్లకు కనిపించిన ఎద అందాలు.. వీడియో వైరల్