Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'రంగస్థలం' అంటే నాటకం కాదు.. ప్రతి 'పల్లెటూరు' ఓ రంగస్థలమే: సుకుమార్

సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, సమంత కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం "రంగస్థలం 1985". ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం టైటిల్స్‌ను ప్రకటించినప్పటి నుంచి ఈ చిత్

'రంగస్థలం' అంటే నాటకం కాదు.. ప్రతి 'పల్లెటూరు' ఓ రంగస్థలమే: సుకుమార్
, మంగళవారం, 1 ఆగస్టు 2017 (16:05 IST)
సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, సమంత కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం "రంగస్థలం 1985". ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం టైటిల్స్‌ను ప్రకటించినప్పటి నుంచి ఈ చిత్రం రంగస్థల నాటకాల నేపథ్యం ఉంటుందేమోననే సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. దీనిపై చిత్ర దర్శకుడు సుకుమార్ తాజాగా వివరణ ఇచ్చాడు. 
 
నాటి రంగస్థల నాటకాలకు.. ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పాడు. పట్టణాల్లాగా పల్లెటూళ్లలో ఎవరిగోల వాళ్లదే అన్నట్టుగా ఉండరు. కష్టమొచ్చినా .. నష్టమొచ్చినా అంతా ఒక చోట గుమిగూడతారు. ఏం జరిగిందంటూ తెలుసుకుని తమవంతు సహాయ సహకారాలను అందిస్తారు. అలా వాళ్లందరినీ ఒకేచోట చూసినప్పుడు ఆ ఊరు ఒక వేదికలా కనిపిస్తుంది. ప్రతి పల్లెటూరు ఒక రంగస్థలమే కదా అనిపిస్తుంది. అందువల్లనే పల్లె నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఈ టైటిల్‌ను పెట్టడం జరిగిందని సుకుమార్ వివరణ ఇచ్చారు. కాగా, ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకురానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

A ఫర్ యాపిలూ.. B ఫర్ బుజ్జులూ అంటున్న కేథరిన్... (Video)