Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా రావడం వరం కాదు ఓ శాపం : ఎస్ఎస్ రాజమౌళి

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా రావడం వరం కాదు ఓ శాపం : ఎస్ఎస్ రాజమౌళి
, బుధవారం, 2 సెప్టెంబరు 2015 (14:59 IST)
మెగాస్టార్ ఫ్యామిలీ గురించి టాలీవుడ్‌కు చెందిన హాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకు హీరోగా పరిచయం కావడం ఓ శాపమని వ్యాఖ్యానించాడు. దీనిపై ఫిల్మ్ నగర్‌లో ఓ పెద్ద చర్చే జరుగుతోంది. అయితే, రాజమౌళి మాటల వెనుక ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకున్న వారు మాత్రం ఈ వ్యాఖ్యలను పెద్ద సీరియస్‌గా తీసుకోవడం లేదు. వరుణ్ తేజ్ - క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'కంచె'. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రాజమౌళి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ఒక పెద్ద కుటుంబం నుండి వచ్చి హీరోగా మారడం ఒక వరం. అయితే, మెగా కుటుంబం నుంచి హీరోగా రావడం వరమే కాదు శాపంగా కూడా మారుతోందంటూ వ్యాఖ్యానించారు.
 
 
దీనికి కారణం మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోలపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగి పోతున్నాయని అందువల్ల ఆ అంచనాలకు తగ్గట్టుగా హీరో వరుణ్ తేజ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకోవాలని అప్పుడే ఈ తీవ్రమైన పోటీలో వరుణ్ తేజ్ నిలబడగాలుగుతాడంటూ వివరణ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితులలో ఒక సినిమాను తీసి ప్రేక్షకులను మెప్పించాలి అంటే ఎంత కష్టమో తనకు తెలుసని, అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు చెప్పారు. కాగా, కంచె సినిమా రెండో ప్రపంచ యుద్ధం నాటి కథ, సన్నివేశాలతో తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో తీసిన సినిమాలు తెలుగు తమిళ భాషలలో ఇప్పటివరకు రాకపోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu