Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'శ్రీమంతుడు' కలెక్షన్స్... యుఎస్ఏలో $3 మిలియన్ మార్కును దాటేనా?

'శ్రీమంతుడు' కలెక్షన్స్... యుఎస్ఏలో $3 మిలియన్ మార్కును దాటేనా?
, బుధవారం, 9 సెప్టెంబరు 2015 (20:06 IST)
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' చిత్రం విదేశాల్లో కూడా కనకవర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ప్రాంతీయ భాషా చిత్రాల వసూళ్ళలో యుఎస్ఏ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇపుడు ఈ చిత్రం పూర్తి కలెక్షన్లపై సరికొత్త చర్చకు తెరలేసింది. ఈ చిత్రం మూడు మిలియన్ల డాలర్లను వసూలు చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
 
 
కాగా, ఇప్పటివరకు 2,882,809 (రూ.19.26 కోట్లు) అమెరికా డాలర్లను వసూలు చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ఆరు థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. దీంతో మూడు మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించడం కష్టమనే సందేహాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఒక ప్రాంతీయ భాషా చిత్రం అమెరికాలో రాబట్టిన వసూళ్ళలో 'శ్రీమంతుడు' చిత్రం సరికొత్త రికార్డును నెలకొల్పింది. మరోవైపు.. ఈ కలెక్షన్ల వ్యవహారాన్ని పక్కనబెడితే... గ్రామాలను దత్తత తీసుకునే అంశంలో అనేక మందికి ఆదర్శంగా నిలిచిందని చెప్పొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu