Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీమంతుడు వర్క్‌ కాలేదు.. అందుకే వాయిదా, బాహుబలి కోసం కాదట...

శ్రీమంతుడు వర్క్‌ కాలేదు.. అందుకే వాయిదా, బాహుబలి కోసం కాదట...
, శనివారం, 4 జులై 2015 (18:03 IST)
ఇటీవలే మహేష్‌ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా బాహుబలి జులై 10న విడుదల అవుతున్నందున ఒకే నెలలో విడుదల చేయడం భావ్యం కాదనీ, రెండు పెద్ద బడ్జెట్‌ చిత్రాలు కావడంతో తగిన న్యాయం చేయాలని తలచి ఆగస్టుకు 7కు వాయిదా వేసినట్లు దర్శకనిర్మాతలు ప్రకటించారు. అయితే ఆ తర్వాత రాజమౌళి మాత్రం.. ఓ రోజు... శ్రీమంతుడు వాయిదాకు అసలు కారణం.. వారి పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కాలేదని కారణంగా పేర్కొన్నారు. 
 
ఆ తర్వాత రోజు.. మహేష్ బాబు ఓ ఆసుపత్రి ఓపెనింగ్‌కు వచ్చి... రెండు సినిమాలు బాగా ఆడాలనీ, ఈ నిర్ణయం తీసుకున్నామనీ, బాహుబలికి భయపడి కాదని ప్రకటించాడు. వెంటనే.. మహేష్‌ బాబుకు థ్యాంక్స్‌ చెబుతూ.. రాజమౌళి ట్వీట్‌ చేశాడు. కానీ అసలు విషయం ఏమంటే... శ్రీమంతుడు అన్నపూర్ణ స్టూడియోలో పాట చిత్రీకరణతో, చిన్నపాటి ప్యాచ్‌వర్క్‌తో షూటింగ్‌ మొన్ననే పూర్తయింది. 
 
ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ జరుగుతోంది. అందులో భాగంగా డబ్బింగ్‌ కూడా శుక్రవారమే ప్రారంభమైంది. మహేష్‌ బాబు డబ్బింగ్‌ మొదలు పెట్టాడు. దీంతో ఇంకా పోస్ట్‌ప్రొడక్షన్‌ పూర్తికాని ఈ సినిమాకు బిల్డప్‌ ఇచ్చి.. బాహుబలి కోసమే వాయిదా వేశారనే బిల్డప్‌ ఇవ్వడం హాస్యాస్పదంగా వుందని ఫిలింనగర్‌ కథనాలు విన్పిస్తున్నాయి. బాహుబలికి మరింత క్రేజ్‌ రావడం కోసం ఇద్దరు నిర్మాతలు మాట్లాడుకుని ఇటువంటి ప్రకటన ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
అప్పటికే శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ, బాహుబలి సమర్పకుడు కె.రాఘవేంద్రరావు తరచూ ఫోన్లలో సంభాషించుకుంటున్నట్లు తెలిసిందే. కనుక ఇదో పబ్లిసిటీ స్టంట్‌గా కొందరు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా.. రెండు సినిమాలు బాగా ఆడాలనేది అందరికీ వుంటుంది.. ఇకపోతే... ఈ నెల 18న శ్రీమంతుడు ఆడియోను శిల్పకళావేదికలో భారీగా ఏర్పాటు చేస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందించారు.

Share this Story:

Follow Webdunia telugu