Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'హరహర మహదేవ' సోనారిక లిప్ లాక్... హీటెక్కిస్తోందట...

'హరహర మహదేవ' సోనారిక లిప్ లాక్... హీటెక్కిస్తోందట...
, బుధవారం, 1 జులై 2015 (15:30 IST)
సినిమాల్లో లిప్‌లాక్‌లు కామన్‌ అయిపోయాయి. మాస్‌ చిత్రాల పేరుతో హీరోహీరోయిన్లు పెదాల చుంబనం పేరుతో రెచ్చిపోతున్నారు. మాస్‌ పల్స్‌ తెలుసుకుని వారు కథలో భాగంగా ప్రవేశపెట్టి క్యాష్‌ చేసుకునేందుకు చూస్తున్నారు. ఇందుకు హీరోయిన్లు కూడా అంగీకారం తెలుపుతున్నారు. జాదూగాడు సినిమాలో సోనారిక హీరో నాగశౌర్యతో చేసిన లిప్‌లాక్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆ నటి హిందీ సీరియల్‌ హరహరమహదేవలో నటించింది.
 
అయితే తెలుగు సినిమాలో ఇలా నటించడంపై కొన్ని కామెంట్లు వినబడుతున్నాయి. ఆమె ఇక్కడ కొన్నాళ్ళు సెటిల్‌ కావాలనుకుంటున్నట్లుగా ఉందనీ, అందువల్ల లిప్ లాక్స్, ఎక్స్‌పోజింగులకు అడ్డు చెప్పడంలేదని తెలుస్తోంది. కాగా మరో రెండు చిత్రాల్లో యువ కథానాయకులు ఆమెతో జోడీకట్టేందుకు సిద్ధమయ్యారు. త్వరలో ఆ వివరాలు వెల్లడికానున్నాయి. అనుష్క తరహాలో బొద్దుగా కన్పించే ఈ భామ... అవసరం మేరకు కాస్త ఒళ్లు తగ్గించేందకు సిద్ధమయినట్లు తెలుస్తుంది.  ప్రముఖ దర్శకుడు సూచన మేరకు కొంత బరువు తగ్గేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu