Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డిక్టేటర్: బాలయ్యతో రెండో సారి సోనాల్ చౌహాన్ రొమాన్స్

డిక్టేటర్: బాలయ్యతో రెండో సారి సోనాల్ చౌహాన్ రొమాన్స్
, గురువారం, 2 జులై 2015 (11:31 IST)
బాలయ్య 99వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న డిక్టేటర్ సినిమాలో సోనాల్ చౌహాన్ నటిస్తోంది. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది. ఇప్పటికే లెజెండ్ సినిమాలో ఆమె బాలకృష్ణతో జోడీ కట్టి, ఆడియన్స్‌ని ఆకర్షించింది. దాంతో మరోమారు ఆయన సరసన నటించే ఛాన్స్‌ను కొట్టేసింది. సాధారణంగా బాలయ్య చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండటాన్నే ఫ్యాన్స్ లైక్ చేస్తారనే విషయం తెలిసిందే. 
 
ఈ సినిమాలో ఒక కథానాయికగా 'అంజలి' ఎంపిక కాగా .. తాజాగా సోనాల్‌ని తీసుకున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సినిమా టైటిల్‌కి తగిన విధంగా బాలయ్య పాత్రను పవర్ ఫుల్‌గా చూపించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. లెజెండ్ హిట్ సెంటిమెంట్‌తోనే సోనాల్ చౌహాన్‌ను డిక్టేటర్ మూవీ కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu