Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుష్క సైజ్ జీరోకు ఎఫైర్ చిక్కు: కలెక్షన్స్ సాధిస్తే.. కష్టమే..!

అనుష్క సైజ్ జీరోకు ఎఫైర్ చిక్కు: కలెక్షన్స్ సాధిస్తే.. కష్టమే..!
, బుధవారం, 25 నవంబరు 2015 (14:47 IST)
మొన్న డీగ్లామర్ పాత్రతో కనిపించింది. నిన్న కత్తి పట్టి రుద్రమదేవినంటూ అనుష్క అలరించింది. ప్రస్తుతం సైజ్ జీరో అనే సినిమాతో అనుష్క మాయ చేయబోతోంది. హీరోయిన్‌గా అనుష్క కష్టపడి సైజ్ జీరో కోసం బరువు పెంచింది. అయితే సైజ్ జీరోకు ఎఫైర్ చిక్కొచ్చి పడింది. 
 
ఎఫైర్ చిక్కు అంటే.. అనుష్క ఎఫైర్లో చిక్కుకుందని కాదు. అనుష్క సినిమా రిలీజ్ రోజే ఎఫైర్ అని మరో సినిమా రిలీజ్ కాబోతోంది. అనుష్క సినిమాకు పోటీ  వస్తుందా..అంత సీన్ ఉందా.. అన్న సంగతి పక్కకు పెడితే.. ఈ నెల 27న ఒకే రోజు రిలీజ్ కావడం కొంతవరకు ప్రభావం చూపొచ్చునని సినీ పండితులు అంటున్నారు.
 
ఎఫైర్ సినిమా విషయానికి వస్తే యాంకర్ ప్రశాంతి హాట్ హాట్‌‍గా నటించిన సినిమా ఇది. ఇద్దరమ్మాయిల ప్రేమ కథకు హార్రర్ జోడించిన క్రైమ్ సినిమా. క్రైమ్, హారర్ సినిమాలకు ఆదరణ లభిస్తున్న సమయంలో ఒకవేళ ఎఫైర్ కనుక అనూహ్యంగా బాగా ఆడితే సైజ్ జీరోకు చిక్కులు తప్పవు. మరి సైజ్ జీరో, ఎఫైర్ సినిమాల మధ్య పోటీ ఎలా వుంటుందో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu