Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా భర్త నన్ను వేధిస్తున్నాడు... గాయని కౌసల్య ఫిర్యాదు...

నా భర్త నన్ను వేధిస్తున్నాడు... గాయని కౌసల్య ఫిర్యాదు...
, మంగళవారం, 24 నవంబరు 2015 (19:28 IST)
సంగీత ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గాయని కౌసల్య తను వేధింపులకు గురవుతున్నట్లు పోలీసులను ఆశ్రయించారు. తన భర్త బాలసుబ్రహ్మణ్యం తనను వేధిస్తున్నట్లు ఆమె సంజీవరెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కౌసల్య భర్తను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. కాగా కౌసల్య భర్త ఆమె చిన్ననాటి స్నేహితుడే. అతడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఎంతో కష్టపడి ఆమె సినీ నేపధ్య గాయనిగా స్థిరపడింది. మొదట్లో ఈటీవీ వారు నిర్వహించిన పాడుతా తీయగా, గీతాంజలి వంటి కార్యక్రమాల్లో గాయనిగా పాటలు పాడారు. 
 
ఆ తర్వాత సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పద్మావతి యూనివర్శిటీలో శాస్త్రీయ సంగీతంలో పీజీ పూర్తి చేసిన ఆమె ‘మీ కోసం’ సినిమాతో గాయనిగా పరిచయమయ్యారు. స్వర్గీయ నందమూరి జానకీరామ్ కుమారులు మాస్టర్ నందమూరి తారక రామారావు బాల నటులుగా పరిచయం అవుతున్న ‘దాన వీర శూర కర్ణ’ సినిమాకు కౌసల్య సంగీతం కూడా అందిస్తున్నారు. కెరీర్ పరంగా ఉన్నత స్థానానికి చేరుకున్నప్పటికీ ఆమెకు వేధింపులు తప్పడంలేదని ఆమె ఫిర్యాదును బట్టి అర్థమవుతుంది. కౌసల్య గత కొంతకాలంగా భర్త నుంచి విడిగా తన కుమారుడి వద్ద ఉంటున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu