Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''కబాలి'' ఫస్ట్ షో.. శింబు 250 టిక్కెట్లు కొన్నాడు.. ఆ సీన్‌కు సూపర్ రెస్పాన్స్.. ''కబాలి రా'' అనగానే?!

శింబు వివాదాల పుట్ట అనే విషయం అందరికీ తెలిసిందే. నయనతార లవ్వాయణం, బీప్ సాంగ్ వివాదంతో శింబు పేరును సినీ ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోరు. అలాంటి శిలంబరసన్.. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు వీరాభిమాన

''కబాలి'' ఫస్ట్ షో.. శింబు 250 టిక్కెట్లు కొన్నాడు.. ఆ సీన్‌కు సూపర్ రెస్పాన్స్.. ''కబాలి రా'' అనగానే?!
, శుక్రవారం, 22 జులై 2016 (11:48 IST)
శింబు వివాదాల పుట్ట అనే విషయం అందరికీ తెలిసిందే. నయనతార లవ్వాయణం, బీప్ సాంగ్ వివాదంతో శింబు పేరును సినీ ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోరు. అలాంటి శిలంబరసన్.. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు వీరాభిమాని. రజనీకాంత్ సినిమా విడుదలైతే మొదటి రోజే ఆయన సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడతారు. అలాగే శింబు కూడా తలైవా సినిమాను ఫస్ట్ రోజే ఎలాగోలా చూసేస్తాడు. 
 
అందుకే తను షూటింగ్‌లో బిజీగా ఉన్నా.. "కబాలి" సినిమా చూడడం కోసం డైరెక్టర్‌తో మాట్లాడి షూటింగ్‌ను వాయిదా వేయించాడు. తనకే కాకుండా తన టీమ్ మొత్తానికి కలిపి 250 ఎఫ్‌డీఎఫ్ఎస్ (ఫస్ట్ డే ఫస్ట్ షో) టికెట్లు బుక్ చేశాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ అధికారికంగా తెలిపారు. రవిచంద్రన్ డైరెక్షన్‌లో "అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్" సినిమా షూటింగ్‌ కోసం శింబు ప్రస్తుతం మదురైలో ఉన్నాడు. అక్కడే ‘కబాలి’ సినిమా ఫస్ట్‌ షో చూడడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.
 
ఇదిలా ఉంటే తమిళనాటనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రజనీ కాంత్ కబాలి ఫస్ట్ షో వేసే థియేటర్లు ఈలలు, కేకలతో దద్ధరిల్లిపోయాయి. దేశంలో చాలా థియేటర్‌లలో ఇవాళ ‘కబాలి’ రిలీజ్ అయింది. ఫస్ట్ షోలో చూసినవారంతా కబాలి ఇంట్రడక్షన్ సీన్‌కు ఫిదా అయిపోతున్నారట. జైలు సిబ్బంది తలుపు తీస్తుండగా రజనీకాంత్ తనదైన స్టయిల్‌లో నడుచుకుంటూ బయటికి వచ్చే సీన్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఆ సీన్ సూపర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారట. 
 
తొలి సన్నివేశంలో రజనీని జైలులో ఉన్నట్లు వెనుక నుంచి చూపించారట. సినిమా మొదటి భాగంలో ఫైట్ తర్వాత ఇంట్రడక్షన్ సాంగ్ వస్తుందట. "కబాలి రా" అనే డైలాగ్ వచ్చినప్పుడు ప్రేక్షకుల కేరింతలు మిన్నంటాయట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కబాలి క్విక్ రివ్యూ: గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రజనీకాంత్ కబాలి.. ఫ్యాన్స్‌‌కు పండగే పండగ..!