Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మో శ్రుతిహాసన్ గట్టిదే.. ట్విట్టర్లో మహేష్, త్రిషను వెనక్కినెట్టేసిందోచ్!

అమ్మో శ్రుతిహాసన్ గట్టిదే.. ట్విట్టర్లో మహేష్, త్రిషను వెనక్కినెట్టేసిందోచ్!
, గురువారం, 1 అక్టోబరు 2015 (14:44 IST)
సినీ లెజెండ్ కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ పట్టుకున్నదల్లా బంగారమవుతోంది. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్‌కు తర్వాత గోల్డెన్ లెగ్‌లో పేరు కొట్టేసిన శ్రుతిహాసన్.. శ్రీమంతుడు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ సినిమా లక్కో లేక పులి వల్ల కలిగిన అదృష్టమో తెలియదు కానీ.. మహేష్ బాబు, త్రిషలను బీట్ చేసింది. 
 
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో నటిస్తున్న శ్రుతి హాసన్.. ఇప్పటికే ఇలియానా, కాజల్ అగర్వాల్, తాప్సీ, త్రిషలను వెనక్కి నెట్టింది. వీరంతా శ్రుతిహాసన్‌ తరహాలో బీ టౌన్‌లో రాణించలేకపోయారు. ప్రస్తుతం ఈ క్రేజీ హీరోయిన్ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబును కూడా బీట్ చేసింది. అదీ ట్విట్టర్లో. మహేష్, త్రిషల కంటే శ్రుతిహాసన్ ఫాలోవర్స్ సంఖ్యను పెంచేసుకుంది. త్రిష (20లక్షలు), మహేష్ బాబు (1.57 మిలియన్లు), శ్రుతిహాసన్ (3 మిలియన్లు) ఫాలోవర్స్‌తో టాప్‌లో నిలిచింది.

Share this Story:

Follow Webdunia telugu